Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ఫ్యాన్స్ ..ఏం మాస్ రా నాయనా?

 ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక రకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. 

Balakrishna 108th film title launching in 108 locations
Author
First Published Jun 7, 2023, 5:19 PM IST


బాలయ్య సినిమాలే కాదు.. ఆయన అభిమానులు సైతం కాస్తంత విభిన్నంగానే ఉంటారు. అలాంటి అభిమాని సినిమా డైరక్టర్ చేస్తే...ఆ రచ్చ ఎలా ఉంటుంది...ఆ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి..ఊహించశక్యం కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే...

బాలయ్య కెరీర్ లో 108వ రాబోతున్న ఈ మూవీపై భారీగానే ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. మరోవైపు బాలయ్య బర్త్ డే వస్తుండడంతో సెలబ్రెషన్స్ షూరు చేశారు అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు NBK 108 మేకర్స్.

ఈ సినిమా టైటిల్ ను రేపు (జూన్ 8) లాంచ్ చేయనున్నట్లు  అనౌన్స్ చేశారు. అయితే ఈ టైటిల్ ను ఇప్పటిదాకా ఎవరు చెయ్యని విధంగా చాలా  వినూత్నంగా ప్రకటించబోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 హోర్టింగ్స్ పై ఈ టైటిల్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక రకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇలా 108 లొకేషన్స్ లో 108 హోర్డింగ్ లలో టైటిల్ లాంచింగ్ అనేది ఏ హీరో సినిమాకు ఇప్పటిదాకా జరగలేదు అన్నది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

 డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ బాలయ్య బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios