బాలీవుడ్ నటుడు, హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన మృతిపై సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే స్పందించారు. సుశాంత్ మరణ వార్త తెలిసిన వెంటనే ముంబయిలోని స్థానిక మీడియా ఛానెల్ ఒకటి అతని మాజీ ప్రేయసి అంకితకు ఫోన్ చేశారు.

కాగా... వారు ఫోన్ చేసే వరకు ఆమె సుశాంత్ చనిపోయాడనే విషయం తెలియకపోవడం గమనార్హం. వారు చెప్పగానే.. ఏంటి.. అని ఆమె షాకయ్యారు. ఆ తర్వాత వెంటనే అంకిత ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.

కాగా..  సుశాంత్, అంకితలు గతంలో జీ టీవీలో ప్రసారమైన ‘ పవిత్ర రిష్తా’ సీరియల్ లో కలిసి నటించారు. ఆ సీరియల్ బాగా పాపులర్ అయ్యింది. వీరిద్దరి జోడీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కాగా... ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు వారు డేటింగ్ చేశారు.

అయితే... ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాతే  సుశాంత్ సినిమాల్లో ప్రయత్నించి క్రేజ్ సంపాదించుకున్నారు. వరసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. కాగా... వారు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఉంటూ వచ్చారు.

అంకితకు మణికర్ణిక సినిమాలొ ముఖ్య పాత్ర పోషించగా.. ఆ సందర్భంగా సుశాంత్ ట్విట్టర్ లో ఆమెకు ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేశారు. 

ఇదిలా ఉండగా..  ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   సుశాంత్ సింగ్ ఎందుకు  ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉన్నది.  సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది.  

ఎంఎస్ ధోని సినిమాతో సుశాంత్ సింగ్ మంచిపేరు తెచ్చుకున్నారు.  2008లో సుశాంత్ సింగ్ స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు.  ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ పేరు మారుమ్రోగిపోయింది.  

ఆ తరువాత కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుతుపెట్టారు.  ఈ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు.  కొన్ని రోజుల క్రితమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.