బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 65వ రోజు మంగళవారం ఎపిసోడ్‌లో అఖిల్‌ తన విశ్వరూపం చూపించారు. సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన ప్రియురాలిగా భావించే మోనాల్‌పై సంచలన కామెంట్‌ చేశారు. అలాగే సోహైల్‌, మెహబూబ్‌లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. కెప్టెన్సీ టాస్క్ లో సహకరించకపోవడంతో వీరిద్దరిపై తీవ్రంగా ఫైర్‌ అయ్యాడు. 

మంగళవారం కెప్టెన్సీ టాస్క్ లో సభ్యులు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని బిగ్‌బాస్‌ ఫైర్‌ అయ్యాడు. సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కెప్టెన్సీ టాస్క్ నే రద్దు చేశారు. ఎవరికీ నెక్ట్స్ వీక్‌ ఇమ్యూనిటీ అవసరం లేనట్టుందని ఫైర్‌ అయ్యాడు. దీంతో హౌజ్‌ ఒక్కసారిగా హీటెక్కింది. ఇది సభ్యుల మధ్య వివాదాలు రగిల్చింది. గేమ్‌ని, కెప్టెన్సీ టాస్క్ ఖరాబ్‌ చేశారని, పరోక్షంగా బిగ్‌బాస్‌ తనకే వేశాడు. మన ముగ్గురిని టార్గెట్‌ చేశారని మండిపడ్డాడు. ఇది తమపై నెగటివ్‌ ఇంప్రెషన్‌ కలిగేలా చేస్తుందన్నాడు. అఖిల్‌,  మెహబూబ్‌ ఇద్దరూ ఇద్దరే, మొండి వాళ్ళని తన స్టయిల్‌లో ఫైర్‌ అయ్యాడు. 

అఖిల్‌ సైతం తీవ్రంగా కోపానికి గురయ్యాడు. తనకు ఎవరూ సహకరించడం లేదన్నారు. తాను ఎప్పుడూ కెప్టెన్‌ కాలేదని, కెప్టెన్సీ టాస్క్ లో ఇతరులకు సహాయం చేశానని, సోహైల్‌, మెహబూబ్‌లకు కూడా సపోర్ట్ చేశానని, కానీ ఇప్పుడు తనకు సహకరించడం లేదని, స్నేహానికి, రిలేషన్‌కి విలువ ఇవ్వడం లేదన్నారు. 

ఒకరిమధ్య ఒకరికి స్నేహం లేదని, ఇక్కడ ఎలాంటి రిలేషన్‌ లేదన్నారు. అవన్నీ వంటి మాటలే అని, అందరు నటిస్తున్నారని తన ఫ్రస్టేషన్‌ వెళ్లగక్కాడు. మోనాల్‌ని కూడా వాయించాడు. తను బాగా మాట్లాడుతుంది తప్పితే, ఏనాడు తనకు గేమ్‌లో సపోర్ట్ చేయలేదని అన్నాడు. సోహైల్‌, మెహబూబ్‌ ఎప్పుడూ వీరిద్దే గేమ్‌ ఆడుకుంటారని, తనకు విలువ ఇవ్వలేదన్నారు. ఈ ఫ్రెండ్‌షిప్‌, రిలేషన్‌ అన్నీ వేస్ట్ అని, అవి మానేయాలని ఫైర్‌ అయ్యారు. ఇది హైజ్‌లో కాసేపు అలజడి సృష్టించింది.