బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో విలన్ గా పలు చిత్రాల్లో నటించిన అజాజ్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లో అజాజ్ ని డ్రగ్స్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అజాజ్ పై నటి సోఫియా హయత్ సంచలన ఆరోపణలో చేసింది.

అజాజ్, సోఫియా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా అజాజ్ డ్రగ్స్ తీసుకున్నాడని సోఫియా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ''అజాజ్ కి డ్రగ్స్ అలవాటు ఇప్పట్లో వచ్చింది కాదు.. ఎన్నో ఏళ్లుగా అతడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. బిగ్ బాస్ ఇంట్లోనే ఎవరికీ తెలియకుండా అజాజ్ డ్రగ్స్ వాడాడు.

బిగ్ బాస్ నిర్వాహకులు అలాంటివి తీసుకు వెళ్ళనివ్వరు కానీ అజాజ్ చాలా తెలివిగా తన బాడీ బిల్డింగ్ కి సంబంధించిన వస్తువుల్లో డ్రగ్స్ ని దాచి తీసుకొని వచ్చాడు. వాటిని రహస్యంగా వాడేవాడు. అతడు వాడుతుండడం నేను చాలా సార్లు చూశాను. ఆ సమయంలో వింతగా ప్రవర్తించేవాడు. ఆ విషయం హౌస్ మేట్స్ కి అర్ధం కాక అతడి ప్రవర్తనని ఫన్నీ అంటూ ఎంజాయ్ చేసేవారు.

కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉండేది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమని బలవంతం పెట్టాడు. కానీ నేను వాటికి దూరంగా ఉంటూ వచ్చాను'' అంటూ వెల్లడించింది. 

సంబంధిత వార్త.. 

డ్రగ్స్ కేసులో నటుడి అరెస్ట్!