టాలీవుడ్ లో దూకుడు, నాయక్, బాద్ షా వంటి సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల బిగ్ బాస్ టీవీ షోతో పాపులర్ అయిన ఈ యువ నటుడు సినిమాలలో కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు. 

పలుమార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అజాజ్ తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. నిషేదిత ఉత్ప్రేరకాలు కలిగి ఉన్న కారణంగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

2.3 గ్రాముల ఎనిమిది మాత్రలు అజాజ్ దగ్గర ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ తో పాటు రెండు లక్షల నగదు, సెల్ ఫోన్ లను కుడా నార్కోటిక్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు కోర్టులో ఈ కేసు విచారణకి రానుంది.