Asianet News TeluguAsianet News Telugu

పల్లెటూరిలో ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్ రాజ్ పుత్.. ‘జిన్నా’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..

హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా' (Ginna). ఇప్పటికే మంచు విష్ణు  ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. 
 

Actress Payal Rajput first Look Release from Ginna Movie
Author
Hyderabad, First Published Aug 8, 2022, 1:31 PM IST

‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మంచు విష్ణుు (Manchu Vishnu) నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’.  ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విష్ణు. సినిమా ప్రారంభమైన రోజు నుంచే విభిన్నమైన ప్రమోషనల్ టెక్నిక్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు. తాజాగా గ్లామర్ బ్యూటీ, యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Paayal Rajput) ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ పోస్టర్ లో పాయల్ పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తోంది. పాయల్ నటిస్తున్న పాత్రను ‘పచ్చళ్ల స్వాతి’గా అనౌన్స్ చేశారు. పల్లెలూరి అమ్మాయిగా గతంలో పాయల్ ఎప్పుడూ చేయని పాత్రలో ‘జిన్నా’లో  కనిపించనున్నట్టు కనిపిస్తోంది. అచ్చమైన తెలుగమ్మాయిలా పాయల్ ఆకట్టుకోనుంది. పోస్టర్ లో పాయల్ లెహంగా వోణీ ధరించి క్యూట్ లుక్ ను సొంతం చేసుకుంది. సింపుల్ లుక్ లో అదరగొట్టింది. పోస్టర్ పాయల్ పాత్రపై ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే Ginna Movie నుంచి వచ్చిన  మంచు విష్ణు ఫస్ట్ లుక్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ చిత్రంలో విష్ణు ఫుల్ యాటిట్యూడ్ తో మాస్ అండ్ క్లాస్ టచ్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.  యాక్షన్ అండ్ రొమాన్స్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న  ఈ చిత్రానికి సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. AVA ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై చిత్రం రూపొందుతోంది. వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్  చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రాన్నిన హిందీ, తమిళం మరియు మలయాళంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Follow Us:
Download App:
  • android
  • ios