సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందిస్తోన్న ''మహర్షి'' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలు పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించాల్సి వుంది. 

దానికోసం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పల్లెటూర్లను కూడా పరిశీలించారు. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో పల్లెటూరులో ఎక్కువ రోజులు షూటింగ్ నిర్వహించలేమని, జనాల తాకిడి ఎక్కువగా ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది.

దీనికోసం ఏకంగా పల్లెటూరి సెట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేశారు. పక్కా విలేజ్ ని తలపిస్తోన్న ఈ సెట్ కోసం రూ.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో మహేష్ బాబు, అల్లరి నరేష్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

సినిమాలో గ్రామం ఎపిసోడ్ కి సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా నిలవబోతున్నారని చెబుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'మహర్షి' సినిమాతో రిస్క్ లో పడతారా..?

మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?