కోలీవుడ్ లో శంకర్ తన సినిమాలను ఏ స్థాయిలో రిలీజ్ చేస్తాడో అదే తరహాలో తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇప్పటివరకు శంకర్ చేసిన ప్రతి ఒక్క సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలోనే రిలీజవుతూ వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం 2.0 సినిమాను కూడా నవంబర్ 29న భారీగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ తో చర్చలు జరుపుతున్నాడు. 

కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సినిమా విడుదలకు ఇబ్బందులు తప్పేలా లేవని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సినిమా తెలుగు రైట్స్ ని ఏషియన్ సునీల్ కి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఎప్పుడో అమ్మేసింది. అయితే విడుదల తేదీ వాయిదా పడటంతో అడ్వాన్సులు వెనక్కి ఇవ్వాలని బయ్యర్ నుంచి ఒత్తిడి పెరిగింది. 

సునీల్ తో పాటు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ - సురేష్ బాబు కూడా పాట్నర్స్ గా ఉన్నట్లు సమాచారం. అయితే అప్పుడే లైకా ఇచ్చిన అడ్వాన్స్ లో 13కోట్ల వరకు ఉంచుకొని మిగతావి వెనక్కి ఇచ్చి సినిమా రిలీజప్పుడు తీసుకుంటామని చెప్పారట. అయితే ఇప్పుడు లైకా ప్రొడక్షన్ వేరే వారికి తెలుగు హక్కులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. వారి దగ్గర ఉన్న 13కోట్లను సునీల్ కి వడ్డీలేకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారట. 

 

ఇవి కూడా చదవండి.. 

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు

కానీ అందుకు సునీల్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఎన్వీ.ప్రసాద్ 2.0 తెలుగు రైట్స్ దక్కించుకున్నట్లు.. సంప్రదింపులు కూడా  జరుపుతున్నట్లు టాక్. అయితే సునీల్ తో అగ్రిమెంట్ ఇంకా రద్దు కాలేదు. దీంతో సినిమా రిలీజ్ కు వారి నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో శంకర్ సినిమా ఎలా విడుదలవుతుందో చూడాలి.