ఈ వారం తెలుగులో మూడు సినిమాలు ('భీష్మ‌', 'ప్రెజ‌ర్ కుక్క‌ర్‌', 'వలయం') రిలీజ్ అయ్యాయి. వీటిల్లో 'భీష్మ‌' హిట్ టాక్ తెచ్చుకుంది. మిగతా రెండు సినిమాలు పట్టించుకునే వాళ్లు కరువు అయ్యారు. ఉన్నంతలో 'ప్రెజ‌ర్ కుక్క‌ర్‌'  కాస్త బజ్ క్రియేట్ అయ్యింది కానీ  'వలయం' ని పట్టించుకునేవాళ్లే లేరు.  మంచి ఎక్సపెక్టేషన్స్ తో విడుద‌లైన `ప్రెజ‌ర్ కుక్క‌ర్‌` లో సాయి రోన‌క్ హీరోగా న‌టించాడు. అమెరికా మోజులో ప‌డిన యువ‌త ఇబ్బందులు ఈ సినిమాలో చూపించారు.

అలాగే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ప‌బ్లిసిటీ గ‌ట్టిగా చేశారు. అయితే ఫ‌లితం లేకుండా పోయింది. క‌థ బాగున్నా,  స్క్రీన్ ప్లే నీరసంగా సాగ‌డంతో ఈ సినిమాని ప్రేక్ష‌కులు తిప్పి కొట్టారు. ఈ సినిమాకు శుక్ర‌వారం, శ‌నివారం,ఆదివారం బీసీ సెంట‌ర్ల‌లో కొన్ని చోట్ల క‌ల‌క్ష‌న్లు బాగున్నాయి.  అవి రిక‌వ‌రికి ఏమాత్రం స‌రిపోవని తేలింది. ఇక `వ‌ల‌యం` ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ సినిమాని ప‌ట్టించుకున్న‌వాళ్లే లేరు.

మరో ప్రక్క భీష్మతో తెలుగు పరిశ్రమలో సాగుతున్న వ‌రుస ప్లాఫ్ లకు బ్రేక్ వేశాడు నితిన్‌. సంక్రాంతి త‌ర‌వాత తెలుగులో వచ్చిన ఏ సినిమా ఆడలేదు. నిర్మాత‌ల‌కు లాభాలు చూపించదు. భీష్మ ఆ లోటు తీర్చ‌బోతోందంటున్నారు.  మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ 5.5 కోట్లు సాధించి - సూప‌ర్ ఓపెనింగ్ అందుకున్న భీష్మ‌.. రెండో రోజూ,మూడో రోజు అదే జోరు కొన‌సాగించింది.  

రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన విజయ్ దేవరకొండ..?
 
నితిన్ - ర‌ష్మిక జంట‌గా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి 'ఛ‌లో' తో ఆకట్టుకున్న వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీసు ద‌గ్గ‌ర హిట్ టాక్ తెచ్చుకుంది. నితిన్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి.ఈ  సినిమాకు కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అవ్వ‌డం, నితిన్ - ర‌ష్మిక మ‌ధ్య కెమిస్ట్రీ పండ‌డం బాగా ప్లస్ అయ్యింది. దానికి తోడు క్లీన్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డంతో కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.