రామ్ చరణ్ వంటి స్టార్ హీరో నెక్ట్స్ ఏ దర్శకుడుతో చేయబోతాడు, సినిమా కథేంటి,హీరోయిన్ ఎవరు వంటి విషయాలు ఎప్పుడూ ఫ్యాన్స్ కు ఆసక్తి కరమే. ప్రతీ సినిమా ఓకే చేసేముందు ఈ చర్చ జరుగుతూంటుంది. స్టార్ డైరక్టర్ లేదా ఫామ్ లో ఉన్న దర్శకుడుతో సినిమా అంటే అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. అదే ప్లాఫ్ లో ఉన్న డైరక్టర్ అయితే...ఇప్పుడు చెర్రీ అభిమానుల పరిస్దితి అలానే ఉందని సమాచారం.

ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం నిజమైతే....రామ్ చరణ్ ..తాజాగా విక్రమ్ కుమార్ కథని విని ఓకే చేసారు. ఆయన గత చిత్రాలు అఖిల్ తో చేసిన హలో, నాని తో చేసిన గ్యాంగ్ లీడర్ రెండూ వర్కవుట్ కాలేదు. సూర్యతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతకు ముందు చేసిన 24 పరిస్దితి కూడా కొంచెం అటూ ఇటూలో అదే. అయితే రామ్ చరణ్ మాత్రం విక్రమ్ కుమార్ చెప్పిన విభిన్నమైన స్టోరీ లైన్ విని...వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇఛ్చేసారట. తన కెరీర్ లో ఇదో స్పెషల్ చిత్రం అవుతుందని భావిస్తున్నారట.

విక్రమ్ కుమార్ రెడీ చేసిన ఆ కథ ప్రత్యకమైన కథ, స్క్రీన్ ప్లే తో సాగుతుందిట.ఏప్రియల్ లాస్ట్ వీక్ లో ఈ సినిమాకు సంభందించిన ప్రకటన వచ్చే అవకాసం ఉంది. మైత్రీ మూవీస్ వారు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తారు.  ప్రస్తుతం రామ్ చరణ్.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఇదే చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.