Asianet News TeluguAsianet News Telugu

టాప్ లెస్ గా టైట్ హగ్.. రాయ్ లక్ష్మీ బోల్డ్ రొమాన్స్ వైరల్

రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో తన అందంతో నెటిజన్లని కట్టిపడేస్తోంది. అవసరమైన మేరకు అందాలు ఆరబోసే హీరోయిన్లలో రాయ్ లక్ష్మీ ఒకరు. పెర్ఫామెన్స్, హాట్ లుక్స్ తో రాయ్ లక్ష్మీ పాపులర్ అయింది. రాయ్ లక్ష్మీ కాంచన మాల టీవీ చిత్రంతో నటిగా పరిచయం అయింది.

Raai Laxmi Poison2 poster viral in social media
Author
Hyderabad, First Published Feb 5, 2020, 3:08 PM IST

రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో తన అందంతో నెటిజన్లని కట్టిపడేస్తోంది. అవసరమైన మేరకు అందాలు ఆరబోసే హీరోయిన్లలో రాయ్ లక్ష్మీ ఒకరు. పెర్ఫామెన్స్, హాట్ లుక్స్ తో రాయ్ లక్ష్మీ పాపులర్ అయింది. రాయ్ లక్ష్మీ కాంచన మాల టీవీ చిత్రంతో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 

ఇటీవల రాయ్ లక్ష్మీకి ఎక్కువగా బోల్డ్ రొమాంటిక్ మూవీస్, ఐటెం సాంగ్స్ లో ఆఫర్స్ వస్తున్నాయి. ఆ చిత్రాలలో రాయ్ లక్ష్మీ రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తోంది.  మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150లో రాయ్ లక్ష్మీ రత్తాలు అనే స్పెషల్ సాంగ్ లో చిందేసింది. దీనితో తెలుగు అభిమానులంతా రాయ్ లక్ష్మీని రత్తాలు అని పిలవడం ప్రారంభించారు. 

సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించింది చాలదు అన్నట్లు రాయ్ లక్ష్మీ ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా ఎంటర్ అయిపోతోంది. ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు, నటులు వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. రాయ్ లక్ష్మీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ పాయిజన్ 2. ఏప్రిల్ 30న ఈ వెబ్ సిరీస్ ని టెలికాస్ట్ చేయబోతున్నారు. 

ఈ సందర్భంగా హీటెక్కించే ఓ పోస్టర్ ని రాయ్ లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పోస్టర్ చూస్తుంటే రాయ్ లక్ష్మీ ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ లో రాయ్ లక్ష్మీ, నటుడు అఫ్తాబ్ ఇద్దరూ టాప్ లెస్ గా టైట్ హగ్ తో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'తొలిసారి వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా. లవ్, హై ఓల్టేజ్ డ్రామా, లవ్, రివేంజ్ తో ఏప్రిల్ లో హీటెక్కించేందుకు రెడీ అవుతున్నాం' అని రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో పేర్కొంది. 

బ్లాక్ డ్రెస్ లో 'ఎఫ్ 2' హీరోయిన్ ఫోజులు.. సమ్మోహన పరిచే అందం!

Follow Us:
Download App:
  • android
  • ios