రిషబ్ శెట్టి తండ్రిగా మోహన్ లాల్, కాంతారా 2 నుంచి సాలిడ్ అప్ డేట్ నిజమేనా?
కాంతారా 2 సినిమాలో మోహన్ లాల్ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో నిజం ఎంత..?
దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కన్నడ సినిమా కాంతారా. ఈ చిత్రంలో నటనకు గాను హీరో, దర్శకుడు రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించింది. దీంతో కాంతారా సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాంతారా 2లో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
రిషబ్ శెట్టి తండ్రి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారని సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాంతారాకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయరామ్ కూడా కాంతారా 2లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
— Christopher Kanagaraj (@Chrissuccess) September 30, 2024
బాలీవుడ్ సినిమాలో రిషబ్ శెట్టి
బాలీవుడ్ ఎంట్రీపై రిషబ్ శెట్టి గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. హిందీ, ఇతర భాషల నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని, అయితే కన్నడ సినిమాలకే తాను కట్టుబడి ఉండాలనుకుంటున్నానని ఆయన అన్నారు. కన్నడ ప్రేక్షకులకు తాను రుణపడి ఉంటానని, కన్నడలోనే సినిమాలు చేయాలనుకుంటున్నానని, అయితే ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చెప్పగలనని, హిందీ బాగానే మాట్లాడతానని, ముంబైలోని ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేశానని, ప్రస్తుతానికి బాలీవుడ్‌లోకి వెళ్లే ఆలోచన లేదని రిషబ్ శెట్టి స్పష్టం చేశారు. కాగా కాంతారా 2022 సెప్టెంబర్‌లో విడుదలైంది. సాధారణ కన్నడ చిత్రంగా విడుదలైన కాంతారా.. మౌత్ పబ్లిసిటీతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 'కెజిఎఫ్' నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రయోగం చేయబోతున్న రిషబ్ శెట్టి..
ఇక తాను నటించి దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో ఓ అంతరించిపోతున్న జాతి గురించి కళ్లకు కట్టినట్టు చూపించిన రిషబ్ శెట్టి.. ఇప్పుడు చేయబోయే కాంతార ప్రీక్వెల్ సినిమాలో సరికొత్త ఫైట్ ఆర్ట్ చూపించనున్నాడు. అవును, చాలా మందికి తెలిసినట్లుగా, రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలో కల్రిపయట్టు యుద్ధ కళను చూపిస్తాడని అంటున్నారు.
ఇంతకీ కలరిపయట్టు అంటే ఏమిటి? 'ది మార్షల్ ఆర్ట్ ఆఫ్ కలరిపయట్టు శతాబ్దాలుగా కేరళలో పాతుకుపోయిన ఒక ప్రత్యేకమైన శారీరక అభ్యాసం'. ఇది అంతరించిపోతున్న వ్యాయామ కళ. ఆర్య,ద్రావిడ జాతి ఉపయోగించిన అతి పురాతనమైనది. ఒకప్పుడు ఈ కళ బాగా ప్రాచుర్యంలో ఉండేదట. రాజులు ప్రత్యేకంగా దీన్ని పెంచి పోషించారని సమాచారం.
నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారావుకు ప్రీక్వెల్ సినిమాలో ఈ కలరిపయట్టును చూపించబోతున్నాడు. దీనికి సబంధించిన కలరిపయట్టు ఫైట్‌ను రిషబ్ శెట్టి ఇప్పటికే కేరళలోని ఓ ఎక్స్‌పర్ట్ దగ్గర నేర్చుకున్నాడని అంటున్నారు. ఎంతో కష్టమైనా ఈ కళను.. ఆయన చాలా ఇష్టంగా నేర్చుకన్నాడట. కలరిపయట్టు ఫైట్ ను నేర్చుకునే విధానాన్ని రిషబ్ శెట్టి ఆమధ్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాంతారావు ప్రీక్వెల్ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.