పవన్ గురించి అల్లు అర్జున్ చెప్పిన మాటకి బాలయ్య షాక్.. ప్రభాస్, మహేష్ లలో తనకి ఎవరు బలమైన పోటీ అంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో బలమైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 కనీవినీ ఎరుగని గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2పై హైప్ మామూలుగా లేదు.
కళ్యాణ్ బాబు ... తన దారిలో తను వెళిపోతుంటాడు .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్#UnstoppableWithNBK #AlluArjun #NandamuriBalakrishna pic.twitter.com/6DvnHO2gdp
— Sai Satish (@PROSaiSatish) November 14, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో బలమైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 కనీవినీ ఎరుగని గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2పై హైప్ మామూలుగా లేదు. రిలీజ్ కి కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండడంతో అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. ముందుగా తనకి చెందిన ఆహా ఓటిటిలో బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4కి అతిథిగా హాజరయ్యారు.
బాలయ్యతో సరదాగా మాట్లాడుతూనే అనేక ప్రశ్నలకు అల్లు అర్జున్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. బాలయ్య తప్పకుంగా పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారని తెలుసు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతోంది అంటూ రూమర్స్ వస్తున్నాయి. దీనికితోడు ఎన్నికల సమయంలో బన్నీ జనసేన పార్టీని కాదని వైసిపిలో తన స్నేహితుడు రవిచంద్ర రెడ్డికి మద్దతు ఇవ్వడంతో పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ షోలో ఏం మాట్లాడతారు అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు.
బాలయ్య.. పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి స్పందించమని అడిగారు. చిరునవ్వు నవ్విన బన్నీ.. ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. నేను సమాజంలో చాలా మంది పొలిటిషియన్లు, బిజినెస్ మ్యాన్ లని దగ్గర నుంచి చూశాను. కళ్యాణ్ గారిలో ఉన్న ధైర్యాన్ని నేను లైవ్ లో చూశాను. ఆయనలో ఆ ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళల్లో డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు అని బన్నీ తెలిపాడు. బాలయ్య స్పందిస్తూ.. ఏది ఏమైనా తన తనదారిలో తాను వెళతాడు కదా అని అన్నారు. వెంటనే అల్లు అర్జున్ సేమ్ మీ లాగే అని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చారు. ఆ విధంగా బన్నీ.. పవన్ ని బాలయ్యతో పోల్చారు.
అల్లు అర్జున్ ఇతర టాలీవుడ్ హీరోల గురించి కూడా కామెంట్స్ చేశారు. ప్రభాస్ అంటే ఆరడుగుల బంగారం అని బన్నీ ప్రశంసించాడు. ఇక మహేష్ బాబు గురించి చెబుతూ అంతా ఆయన అందం గురించి చెబుతుంటారు.. కానీ మహేష్ గారిలో నేను ఒకటి గమనించాను. ఫెయిల్యూర్స్ తర్వాత ఆయన ఇచ్చే కంబ్యాక్ నాకు చాలా ఇష్టం అని అల్లు అర్జున్ తెలిపారు.
Prabhas-Allu Arjun
ఆ తర్వాత బాలయ్య బన్నీని ఇరకాటంలో పెట్టే కొన్ని ప్రశ్నలు అడిగారు. నీకు టాలీవుడ్ లో ప్రభాస్, మహేష్ లలో బలమైన కాంపిటీషన్ ఎవరు అని ప్రశ్నించారు. దీనికి అల్లు అర్జున్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. 'నన్ను ఇంచి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు.. ఎవరంటే అది రేపటి నేనే' అంటూ పుష్ప చిత్రంలోని పాటతో అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారు.