సాధారణంగా హీరోయిన్లు తమపై బోల్డ్ ఇమేజ్ కానీ, శృంగార తారగా కానీ ముద్ర పడితే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటి ఇమేజ్ ఏర్పడితే ఇతర చిత్రాల్లో ఛాన్సులు రావేమోనేనే అనుమానం ఉంటుంది. అందుకనే అంతగా అందాలు ఆరబోసినప్పటికీ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకునేందుకే ఇష్టపడతారు. 

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంతోనే పాయల్ రాజ్ పుత్ హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ గ్లామర్ కుర్రకారుని ఫిదా చేసింది. రొమాంటిక్ సీన్స్ లో కూడా పాయల్ బెదురు లేకుండా నటించింది. ఈ చిత్ర సక్సెస్ లో పాయల్ క్రెడిట్ ఎంతైనా ఉందని చెప్పొచ్చు. 

త్రివిక్రమ్ వాస్తు దోషం పవన్ ని ముంచిందా ?

ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల వెంకీమామ చిత్రంలో వెంకటేష్ సరసన నటించి మెప్పించింది. గత వారం విడుదలైన రవితేజ డిస్కోరాజా చిత్రంలో కూడా పాయల్ రాజ్ పుత్ మెరిసింది. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ పాయల్ పై బోల్డ్ బ్యూటీ అనే ఇమేజ్ అలాగే ఉంది. 

మహేష్, సుకుమార్ లలో ఎవరు తగ్గారు.. లిస్ట్ లో అతడు కూడా!

దీనిపై పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. బోల్డ్ ఇమేజ్ నేను కోరి తెచ్చుకోలేదు. ప్రేక్షకులే నాకు ఆ ఇమేజ్ ఇచ్చారు. ప్రేక్షకులు ఇచ్చిన ఇమేజ్ ని పోగొట్టుకోవడం ఎందుకు. నేనైతే బోల్డ్ ఇమేజ్ ని చెరిపేసుకోవాలని అనుకోవడం లేదు అని పాయల్ రాజ్ పుత్ తెలిపింది. RX 100 తర్వాత పాయల్ రాజ్ పుత్ RDX అనే చిత్రంలో కూడా అందాలు ఆరబోసింది.