అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సమయానికి మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తూ ఉండేవాడు. మహర్షి చిత్రం తర్వాత సుకుమార్, మహేష్ కాంబోలో రెండవ చిత్రానికి ప్రకటన వచ్చింది. సుకుమార్ కూడా మహేష్ కోసం కథ రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు. అలాంటి తరుణంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 

సడెన్ గా తాను సుకుమార్ దర్శకత్వంలో నటించడం లేదని మహేష్ స్వయంగా ట్వీట్ చేశాడు. దీనిపై ఇండస్ట్రీలో అనేక ఊహాగానాలు వినిపించాయి. తాను నాలుగైదు నెలల్లో అనిల్ రావిపూడితో ఓ సినిమా ఫినిష్ చేస్తానని.. అప్పటివరకు వేచి ఉండమని మహేష్ సుకుమార్ ని కోరినట్లు తెలుస్తోంది. అందుకు సుకుమార్ ఫీల్ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 

వెంటనే సుకుమార్, అల్లు అర్జున్ చిత్రానికి ప్రకటన వచ్చేసింది. దీనితో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం ఉంటుందా అనే అనుమానాలు తలెత్తాయి. తాజాగా దీనిపై ఇండస్ట్రీలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. 

త్రివిక్రమ్ వాస్తు దోషం పవన్ ని ముంచిందా ?

వీరి మధ్య విభేదాలు తొలగిపోయాయట. మళ్ళీ సుకుమార్, మహేష్ స్నేహితులుగా మారిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు మహేష్ తదుపరి చిత్రాల జాబితాలో సుకుమార్ కూడా ఉన్నాడని టాక్. మహేష్ బాబు నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఉండబోతోంది. ఇక అనిల్ రావిపూడికి మహేష్ మరో కమిట్మెంట్ కూడా ఇచ్చాడట. 

'మిర్చి' ఐటెం భామ గ్లామర్ హీట్ తట్టుకోగలరా.. ఫొటోస్ వైరల్

సమీప భవిష్యత్తులోనే కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మహేష్ ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత కానీ .. ముందుగా కానీ మహేష్, సుకుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. మహేష్.. సుకుమార్ మధ్య విభేదాలు తొలిగిపోయాయంటే మాత్రం ఫ్యాన్స్ కు సంతోషమే.