మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు. జల్సా చిత్రంతో మొదలైన వీరిద్దరి ప్రయాణం ఆప్త మిత్రులుగా మారే వరకు చేరుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. అందులో జల్సా, అత్తారింటికి దారేది విజయం సాధించగా.. అజ్ఞాతవాసి చిత్రం పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. 

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బన్నీ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, పవన్ కళ్యాణ్ కు అజ్ఞాతవాసి చిత్రం ఓ పీడకలగా మిగిలిపోయింది. 

RRR: మూడు గెటప్పుల్లో ఎన్టీఆర్.. సినిమా మొత్తం నేనే అంటూ షాకింగ్ లీక్!

అల వైకుంఠపురములో చిత్ర సక్సెస్ సంధర్భంగా త్రివిక్రమ్ తన సన్నిహితుల వద్ద ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. తన ఇంటి వాస్తు దోషాన్ని ముందుగానే సరి చేసి ఉంటే అజ్ఞాతవాసి ఫలితం అలా ఉండేది కాదని అన్నాడట. అజ్ఞాతవాసి చిత్ర సమయంలో త్రివిక్రమ్ తన ఇంట్లో కొంత భాగం వాస్తుకు విరుద్ధంగా నిర్మించబడిందట. దాని వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుందని అనుకోలేదని తన సన్నిహితులకు త్రివిక్రమ్ తెలిపారు. 

టాలీవుడ్ స్టార్ హీరోల బలహీనతలు ఏంటో తెలుసా.. ఓ లుక్కేయండి!

అజ్ఞాతవాసి తర్వాత వెంటనే ఆ వాస్తు దోషాన్ని సరిచేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాలు విజయం సాధించాయి. టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది సెంటిమెంట్స్ ని బలంగా నమ్ముతారు. అందులో త్రివిక్రమ్ కూడా ఒకరు.