సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ షో అనేది చాలా కామన్. దర్శకనిర్మాతలు కూడా హీరోయిన్లను తెరపై అందంగానే చూపించాలని అనుకుంటారు. హీరోయిన్లకు లైఫ్ స్పాన్ కూడా తక్కువ కాబట్టి ఉన్నన్ని రోజులు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తుంటారు.

అలానే సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వారి ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో నటి నిధి అగర్వాల్ కూడా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. వీటికి లక్షల్లో లైకులు, కామెంట్స్ వస్తుంటాయి. తాజాగా ఓ నెటిజన్ తన ఫోటోలపై చేసిన కామెంట్ కి ధీటుగా బదులిచ్చింది నిధిఅగర్వాల్.

హిట్టు పడగానే రెమ్యునరేషన్ డోస్ పెంచిన దర్శకులు

అసలు విషయంలోకి వస్తే.. ఓ నెటిజన్ 'మీ లాంటి వల్లే సామాన్య అమ్మాయిలు రేప్ కి గురవుతున్నాయి. మీకంటూ కొంత ప్రైవసీ మైంటైన్ చేయండి.. ఇలాంటి హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా.. సినిమాలకే పరిమితం చేయండి' అని చెప్పాడు. ఇది చూసిన నిధి అగర్వాల్ మండిపడింది. 

ఆ కామెంట్ కి బదులిస్తూ.. ''ఈ వ్యక్తి ఆలోచనలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. దయచేసి మీ అడ్రెస్ ని నాకు పంపిస్తే.. మీకు పింక్ సినిమా పంపిస్తాను. మీకు అది అవసరం'' అంటూ రిప్లయ్ ఇచ్చింది. ఈ విషయంలో నిధిని తన అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.

అయితే 'పింక్' లాంటి సినిమాల వలన ఇలాంటి మనుషుల్లో మార్పు అనేది రాదనీ.. వారి ఆలోచనా విధానం మారదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ప్రియాంకా రెడ్డి అనే డాక్టర్ ని నలుగురువ్యక్తులు కలిసి అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.