డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌పై ముంబై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇందుకు సంబంధించి న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనుంది.

ప్రస్తుతం ముంబై బైకుల్లా జైలులో రియా ఉన్నారు. కాగా సుశాంత్ సింగ్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంపై ఆమెను ఎన్సీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.

రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీని విధించింది. అనంతరం ఆమెను బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. తన స్నేహితుడు సుశాంత్ కోసం రియా డ్రగ్స్ తీసుకొచ్చేదని అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.