టాలీవుడ్ లో ఫ్రెండ్ షిప్ కు కొదవ లేదు. మంచు విష్ణుకు చాలా మంది మంది యంగ్ హీరోలతో మంచి రాపో ఉంది. టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్, సుమంత్, నితిన్ లు మంచు విష్ణుకి మంచి స్నేహితులు. చాలా కాలంగా వీరిలో ఎవరితో అయినా మల్టి స్టారర్ చిత్రంలో నటించాలని విష్ణు ప్రయత్నిస్తున్నాడు. కానీ వర్కౌట్ కావడం లేదు. 

ఇదే విషయాన్ని విష్ణు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ నితిన్, కళ్యాణ్ రామ్, సుమంత్ పై చిలిపి కోపాన్ని ప్రదర్శించాడు. వాళ్లంతా రాస్కెల్స్..తప్పించుకుంటున్నారు అని విష్ణు తెలిపాడు. కళ్యాణ్ రామ్ తో ఇప్పటికే నాలుగు సినిమాలు ప్లాన్ చేశా.. కానీ కుదర్లేదు. ఇక మోసగాళ్లు చిత్రంలో నటించమని సుమంత్ ని కోరా.. పాత్ర నచ్చలేదని వంక పెట్టి తప్పించుకున్నాడు. 

తల్లి కాబోతున్న 'గోపాల గోపాల' నటి.. ప్రెగ్నెంట్ పిక్ వైరల్, కంగ్రాట్స్ చెప్పిన తేజస్వి

ఇక నితిన్ తో దోస్తానా అనే చిత్రం చేయాలనే ప్లాన్ ఉంది. నితిన్ హార్డ్ వర్కర్. నితిన్ కు సక్సెస్ వస్తే తనకు వచ్చినట్లు సంతోషపడతానని విష్ణు తెలిపాడు. నితిన్ కూడా విష్ణు తనకు మంచి ఫ్రెండ్ అని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. 

వాస్తవానికి ఈడో రకం ఆడో రకం చిత్రంలో కళ్యాణ్ రామ్ నటించాల్సింది అని విష్ణు తెలిపాడు. ప్రస్తుతం విష్ణు కన్నప్ప, మోసగాళ్లు అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.