యంగ్ హీరోయిన్ అనిషా ఆంబ్రోస్ అలియాన్ జానకి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. మరికొన్ని చిత్రాల్లో కామియో రోల్స్ చేసింది. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రంలో చిన్న పాత్రలో అనీషా ఆంబ్రోస్ మెరిసింది. 

ఇక సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో మొదట హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అనీషాకే. కానీ ఊహించని విధంగా ఆ ఛాన్స్ చేజారింది. మనమంతా, ఈ నగరానికి ఏమైంది లాంటి చిత్రాల్లో అనీషా మెరిసింది. అనీషా అందరి హీరోయిన్లలా కాదు.. చాలా లో ఫ్రొఫైల్ మైంటైన్ చేస్తుంది. కాబట్టి ఆమె వ్యక్తిగత విషయాలు అంతగా బయటకి రావు. 


గత ఏడాది అనీషా అంబ్రోస్ తన స్నేహితుడు గుణ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. అనీషా ఆంబ్రోస్ ప్రస్తుతం గర్భవతి. ఈ విషయాన్నీ బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 

అనీషా ఆంబ్రోస్ గర్భంతో ఉన్న పిక్ పోస్ట్ చేసి గాడ్ బ్లెస్ యు అని కామెంట్ పెట్టింది. అనీషా, తేజస్వి మంచి స్నేహితులు.