పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రాజకీయాల కారణంగా పవన్ అజ్ఞాతవాసి తర్వాత మరో చిత్రంలో నటించలేదు. త్వరలో పవన్ వకీల్ సాబ్ చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్ర చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. 

అదే విధంగా పవన్, క్రిష్ దర్శత్వంలో పీరియాడిక్ చిత్రం కూడా ప్రారంభమైంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి హీరోయిన్లుగా చాలా మంది నటీమణుల పేర్లు వినిపించాయి. కానీ ఇంతవరకు ఎవరూ ఫైనల్ కాలేదు. 

కారు ప్రమాదానికి గురైన అల్లరి నరేష్ హీరోయిన్.. ఆసుపత్రి నుంచి పరార్

జాక్వెలిన్ ఫెర్నాండేజ్, వాణికపూర్, ప్రగ్య జైస్వాల్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా సౌత్ క్రేజీ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ చిత్రంలో నటించబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. క్రిష్ అనుష్కకు కథ నేరేట్ చేశాడని చిత్ర పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి. 

అనుష్క అందరు స్టార్ హీరోలతో నటించింది కానీ.. ఇంతవరకు పవన్ తో మూవీ చేయలేదు. ప్రస్తుతం వస్తున్న వార్త నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఔరంగ జేబు కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.