అల్లరి నరేశ్ నటించిన కెవ్వు కేక చిత్రం గుర్తుందిగా.. 2013లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కెవ్వుకేక చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో షర్మిల మాండ్రే హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తగా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ షర్మిల నింబంధనలు ఉల్లంఘించి ప్రమాదానికి గురైంది. 

షర్మిల మాండ్రే శనివారం తెల్లవారు జామున 3 గంటలకు తన స్నేహితుడితో కలసి జాలి రైడ్ కు వెళ్ళింది. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పిల్లర్ కు ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షర్మిల ముఖాన్ని తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె స్నేహితుడి కాలు విరిగింది. అయితే ఆందోళన కరమైన గాయాలు కాదు. 

ఇంట్లోనే ఉండండి, ప్రేమని పొందండి.. కానీ గర్భం తెచ్చుకోవద్దు.. నటుడి కుమార్తె హాట్ కామెంట్స్

వీరిద్దరూ పోర్టీస్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. జాగ్వార్ కారులో వీరిద్దరూ రైడ్ కి వెళ్లారు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. కారుని స్వాదీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 

షర్మిల మాండ్రేపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె లాక్ డౌన్ ని ఉల్లంఘిచి కారులో రైడ్ కు వెళ్లడం మొదటి తప్పు కాగా.. ఆసుపత్రి నుంచి పారిపోవడం మరో తప్పు అని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా షర్మిల సన్నిహితులు మాత్రం.. ఆమె జాలి రైడ్ కు వెళ్లలేదని.. మెడిసిన్స్ కోసం వెళ్లినట్లు చెబుతున్నారు.