Asianet News TeluguAsianet News Telugu

నాగ్ సినిమాకే కాదు... టామ్ క్రూజ్ సినిమాకీ అదే సమస్య!

హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమా ప్రియులకు ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ స్టార్ టామ్‌ క్రూజ్‌ గూఢచారిగా ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రాలన్నీ ఫ్యాన్స్ ను  అలరించాయి. 

'Mission: Impossible VII' stops production due to coronavirus outbreak
Author
Hyderabad, First Published Feb 27, 2020, 11:04 AM IST

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. ముఖ్యంగా  చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాల పరిస్దితి అయితే ఘోరం. అక్కడికి మిగతా ప్రపంచదేశాలు రాకపోకలు ఆపేసాయి. అలాగే ఈ కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగులపై కూడా పడింది. ఇప్పటికే మన తెలుగులో నాగార్జున హీరోగా రూపొందుతోన్న వైల్డ్ డాగ్ చిత్రంపై పడింది. ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. మరికొన్ని పెద్ద సినిమాలు తమ షెడ్యూల్స్ ని ప్రక్కన పెట్టాయి. ఇప్పుడు ఆ ప్రభావం హాలీవుడ్‌ సినిమాలపై కూడా పడింది.  ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ లో వస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఆగిపోయింది.
 
‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌  ఏడో భాగం (మిషన్‌ ఇంపాజిబుల్‌ 7) సెట్స్‌ మీద ఉంది. ఈ సీరిస్ లలో వరసపెట్టి హీరోగా నటిస్తూ వస్తున్న టామ్‌ క్రూజ్‌ ఏడో భాగంలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ అమెరికన్‌ యాక్షన్‌ స్పై ఫిల్మ్‌పై కరోనా ప్రభావం పడింది.

డ్రగ్స్ ఇచ్చి నన్ను రేప్ చేశారు.. పాప్ సింగర్ ఆవేదన!

హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమా ప్రియులకు ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ స్టార్ టామ్‌ క్రూజ్‌ గూఢచారిగా ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రాలన్నీ ఫ్యాన్స్ ను  అలరించాయి. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో ఆరు చిత్రాలు విడుదలయ్యాయి. గతేడాది వచ్చిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: ఫాలవుట్‌’ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. కాగా ఈ సిరీస్‌లో మరో రెండు చిత్రాలకు సన్నాహాలు మొదలయ్యాయి.

వీటిలోనూ టామ్‌ క్రూజ్‌ గూఢచారి పాత్రలోనే కళ్లు చెదిరే ఫైట్స్  చేయబోతున్నాడు. ఈ సిరీస్‌లో గత రెండు చిత్రాలు ‘రోగ్‌ నేషన్‌’, ‘ఫాలవుట్‌’లను తెరకెక్కించిన క్రిస్టఫర్‌ మెక్‌క్వర్రీ కొత్త చిత్రాలకూ దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు.అలాగే ఈ కొత్త చిత్రాల విడుదల తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ సిరీస్‌లోని ఏడో చిత్రం 2021 జులై 23న,  ఎనిమిదో చిత్రం 2022 ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

కొద్దిరోజుల ముందే ఇటలీలో మూడు వారాల షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. అయితే అక్కడ కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో చిత్రనిర్మాణ సంస్థ పారామౌంట్‌ పిక్చర్స్‌ ఈ షెడ్యూల్‌ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది జూలై 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios