పాప్ స్టార్ డఫ్ఫీ తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే కొంతకాలంగా ఈ బ్రిటీష్ సింగర్ ఉనికిలో లేకుండా పోయింది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. ఓ జర్నలిస్ట్ మాత్రం ఆమె కోసం అన్వేషించి ఆమె ఎక్కడుందో తెలుసుకున్నాడు.

ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవం విని షాకయ్యాడు. ఆమెకి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారని చెప్పడంతో విషయం కాస్త వైరల్ అయింది. ఈ విషయాలను బయట చెప్పడానికి ఎన్నిసారి నాలో నేనే మథనపడ్డానో మీరు ఊహించలేరు.. కానీ ఇప్పుడు బాగానే ఉన్నాను అంటూ తనకు మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేసిన విషయాన్ని డఫ్ఫీ తెలిపింది.

ఒక్క ఛాన్స్ కోసం వితికా తిప్పలు.. ఫోటోలపై ఫోకస్!

అలా కొద్దిరోజుల పాటు తనను నిర్భందించారని.. ఆ తరువాత అక్కడ నుండి ఎలాగోలా తప్పించుకున్నానని.. కానీ ఈ ఘటన నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని.. ఇంతకుమించి ఏం చెప్పలేనని వెల్లడించింది.

''నా మనసు ముక్కలైన తరువాత గుండె లోతుల్లో నుండి పాట ఎలా పాడగలను అని చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. అప్పుడు నా బాధ ప్రపంచానికి వినబడుతుందేమోనని ఆపేశాను. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. దీనికోసం దశాబ్దకాలం ఎదురుచూశాను'' అంటూ అభిమానులకు చెప్పుకొచ్చింది.