Asianet News TeluguAsianet News Telugu

ఈ తమిళ నాటకం 80 ఏళ్ల నాటిది

political drama is not new to Tamil Nadu

తమిళుల అధికారం గొడవ ఈ నాటిది కాదు. కనీసం 80 సంవత్సరాల చరిత్ర. భారత ప్రభుత్వ చట్టం 1935 కు  అనుగుణముగా  దేశ వ్యాప్తముగా  1937లొ  రాష్ట్ర విధాన పరిషత్ లకు  జరుగిన సాధారణ ఎన్నికలలో అవిభాజ్య భారత దేశములొ ఎనిమిది రాష్ట్రాలలో భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) మెజారిటి సంపాదించి ప్రభుత్వఏర్పాటుకు సిద్ధమైనది. 

 

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు లేక ఎస్.సత్యమూర్తి ప్రధాని (Premier - ఆ నాటి హౌదా) గా ఖరారైనది.  అనూహ్య  సంఘటనలు తెరపైకి వచ్చి, రాజగోపాలాచారి అలియాస్ రాజాజిగారిని జులై 1937 ప్రధానిగా నియమించింది.

 

 బ్రిటిష్ ప్రభుత్వం, భారతాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో చేర్చడాన్ని ప్రతిఘటిస్తూ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ 1939 ఒక్టోబర్ లొ రాజీనామా చేసెంతవరకూ ఆ ప్రభుత్వం కొనసాగింది. మరల 1946, ఎప్రిల్ లో స్వాతంత్రం వచ్చువేళ ప్రకాశం గారికి పట్టం కట్టారు. ఆయిన అనుచరులే తమిళ తంబిలతొ కలిసి కుట్రపన్ని, ప్రకాశంగారి ఆప్తులలొ ఒకరైన ఓమండూరు రామస్వామి రెడ్దియార్ గారిని 1947 మార్చ్ లొ గద్దెగె్క్కించారు.

 

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
     కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
  యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
    యధికారముద్రిక లంతరించె!
  యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
    సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
  యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
    చిత్రలేఖకుని కుంచియ,నశించె!

-గుర్రం జాషువా. 

 

 ఖర్మ సింద్దాంతం వారిని వెంటాడింది. 1949, ఎప్రిల్ నుండి జనవరి, 1950 వరకు, ప్రధానిగానూ, గణతంత్రం రాజ్యం ఎర్పడిన తరువాత, జనవరి 26, 1950 నుండి, ఎప్రిల్, 1952, ఎప్రిల్ వరకూ పి.ఎస్.కుమారస్వామి రాజా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.  అదే సంవత్సరం మొట్టమొదటి  సాధారణ ఎన్నికల తరువాత  కామరాజ్ నాడార్ పేరొకటే తెరపైకి వచ్చింది. ఇంచుమించు ఆయన ప్రమాణానికి  సిద్ధమైన సందర్భంలో మరల రాజాజిగారి రంగ ప్రవేశం జరిగింది. విధాన సభ ఎన్నికలో పోటి చెయ్యకుండా, రాబోయె విధాన పరిషత్తులొ, ఆరు నెలల లోపల గవర్నర్ గారి చెత నియమింపబడడానికి సన్నద్ధమై, శ్రీమాన్ ఆచారిగారు ముఖ్యమంత్రిగా ఎప్రిల్ 1952లొ ముఖ్యమంత్రిగా నియమితులైనారు. మహానుభావులు, తరువాత రోజులలొ, కాంగ్రెస్ నుండి  బయటకు వచ్చి. ఇలాంటి రాజ్యాంగ వక్రీకరణను చాలా నిశితముగా విమర్శించారు. అది వేరె సంగతి. 

 

 కామారాజ నాడార్ అవకాశానికొరకు ఎదురు చూస్తూ, రాజాజి గారి సిద్దాంతాన్ని వ్యతిరేకిస్తూ, తిరుగుబాటు బావుట ఎగరవేయడంతొ, 1954 ఎప్రిల్ నుండి 1963 ఒక్టోబర్ వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

 

 "కామరాజ్ ప్రణాళిక" ప్రకారం పెద్దలందరూ, ప్రభుత్వ పదవులు వదలుకొని, పార్టి రాజకీయాలోకి రావాలనే  నియమాన్ని, ప్రధాని నెహ్రూగారు అమలులో పెట్టారు. కామారాజ్ గారి సూత్రాన్ని పాటించి భక్తవత్సలం గారికి అధికారాన్ని అప్పగించారు. ఇంతవరకు అందరూ కారాగార వాసాన్ని అనుభవించిన స్వాతంత్ర సమర యోధులే. 

 

                       1967 లొ జరుగిన సాధారణ ఎన్నికలలొ, కాంగ్రెస్ ఘోర పరాజయ పొంది, "ద్రావిడ మున్నేత్ర కళగం" (DMK) అధికారం చెపట్టి, ఆ పార్టీలొో తిరుగు లెని నాయకుడు, సి.ఎన్ అన్నాదురైగారు, మార్చ్ 1967 లొ ముఖ్య మంత్రి పదవిని అలంకరించారు. వారు క్యాన్సర్ వ్యాధితో అకాల మరణం చెందడముతొ,  మంత్రివర్గములొ రెండవ స్థానంలో  ఉంటూ,  వారికి కుడి భుజంగా ఉండిన నెడుంచిళియన్ గారు 1969 ఫెబ్రవరిలొ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చెశారు. అయితే,  అది మూన్నాళ్ళ ముచ్చటగానే  మిగిలిపోయింది.

 

రాజకీయ చతురుడు, ఎమ్.కరుణానిధి వారం రోజులలోనే, ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకొన్నారు. మరల 1971 ఎన్నికలలో పార్టి అధికారంలొకి వచ్చి, కరుణానిధిగారు ముఖ్యమంత్రిగా 1976 వరకూ కొనసాగారు.

 

ఈ ముగ్గురూ ద్రవిడ ఉద్యమములోనూ, హిందీవ్యతిక అలజడిలోనూ, జైలు శిక్ష అనుభవించినవారు.  సిని హీరో, జనప్రీయ, రాజకీయ నాయకుడు ఎమ్.జి.రామచంద్రన్ గారితొ కరుణానిధి విభేదించడముతొ, రాజకీయ సంక్షోభం ఏర్పడి, 1976 జనవరిలొ రాష్ట్రపతి పాలన, మరల 1977లొ ఎన్నికలు రావడం జరిగింది; ఎమ్.జి.ఆర్. గారు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేత్ర కళగం. (AIADMK) పార్టీని స్థాపించడం ఆ పార్టీని ప్రజలు ఆదరించడం వల్ల, ఎమ్.జి.ఆర్. 1980 జూన్ మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన సినినటుడు అయ్యారు.చరిత్ర సృష్టించారు.

 

తన ఆఖరి ఊపిరివరకూ, అపస్మారక స్థితిలొ ఉన్నప్పటికి, తిరుగు లేని నాయకుడిగా చలామణి అయ్యారు. ఎమ్.జి.ఆర్. మరణా నంతరం, 1987 డిసెంబర్ లొ మరల నెడుంచిళియన్  తెరపైకి వచ్చారు.  ఈ సారి ఒక రోజు ఎక్కువ; 8  రోజులు. కేంద్రములొ రెండుసార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రియైన గుల్జారి లాల్ నందా పరిస్థితి ఇది. నందో రాజ భవిష్యతి.

 

 రాజకీయానుభవమే లేని, ఎమ్.జి.ఆర్. జానకి రామచంద్రన్ గారిని, జనవరి, 1988 న పీఠం ఎక్కించారు. ఆ నాటకానికి 23 రోజులలొ తెరపడింది. రాష్ట్రపతి పాలన తరువాత 1989 లొ ఎన్నికలు జరుగి కరుణానిధిగారు జనవరి, 1989నుండి, జనవరి 1991 వరకు రాజ్యభారం చేసి, విధాన సభ విసర్జన,  రాష్ట్రపతి పాలన మరల 1991 లొ  ఎన్నికలు  ; జయలలితగారి జయభేరి. జూన్, 1991 నుండి డిసెంబర్ 6, 2016 లొ మరణించేవరకూ, ఏఐఏడిఏమ్ కె, ఆన్నాదొరై,  ఎమ్.జి.ఆర్ల. వారసురాలుగా, తిరుగులేని నాయకురాలిగా అధికారం చలాయించినారు.

 

రెండు సార్లు, ఎన్నికలలొ పార్టి, ఓడి పోవడం తో ప్రతిపక్షనేతగానూ,  రెండు సార్లు రాజ్యాంగ పరమైన అడ్డంకులతొ, రాజీనామా చేసి, మరల స్వస్థానానికి రావడం జరిగింది. అపోలొ  ఆస్పత్రిలొ, సెప్టెంబర్, 22, 2016 నుండి డిసెంబర్ 6, 2016లొ  మరణించినట్ళు ప్రకటించెవరకూ, ఆమె ఆరోగ్య పరిస్థితిగురించి ఎన్నో రకాల అపోహాలు వినిపించాయి. నిజం వెలుగులోకి రావచ్చు, రాక పోవచ్చు.  మరణానంతరం పరిణామాలు మాత్రం, విషాదకరం.

 

కన్నడ జ్ఞానపీఠ గ్రహీత ఆచార్య యు ఆర్, అనంతమూర్తిగారు "రాజ భీతి; రాజులేని భీతి" అనే ఒక వ్యాసములో అక్బర్ మరణానంతరం మొఘల్ సామ్రాజ్యం లోని అల్లోల కల్లోల పరిస్థితి వివరిస్తారు.  స్థానిక పాలకులు క్రూరంగా వ్యవహరించారు. రాకుమారుడు సలిమ్, జహాంగీర్, అనే రాజముద్రతో పట్టాభిషక్తుడయ్యే వరరకూ, అనిశ్చిత పరిస్థితి కొనసాగింది. ఇందిరాగాంధి చని పోయినప్పుడు కూడా 1984 అక్టోబర్ లొ సిక్కుల ఊచకోత దారణం మనకు తెలిసిందే. ఇంతవరకు తమిళ తంబిలు గవర్నర్ అదపులొ ఉన్నారు. 

 

            శశికళ తానె జయలలితకు వారసురాలిగా ఎన్నికైనది ఒక నాటకం. అత్యున్నత న్యాయాలయం, వారిని లంచగొండిగా నిర్ధారించింది.  తీర్పువల్ల మారిన పరిస్థితిలో,  పళనిస్వామిని తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొన్నది.  ఇప్పుడు పన్నీరసెల్వమ్ తిరుగుబాటు బావుటాన్ని ఎగర వేశారు. గవర్నర్ రెండు పక్షాల వాదనలనూ విన్నారు. విధాన సభను సమావేశ పరిచి, అక్కడ బలపరీక్షచెయ్యాలన్న అటార్ని జనరల్ అభిప్రాయం రాజ్యాంగ సమ్మతమైనది. పన్నీర్ సెల్వమ్ గుంపు అదే కోరుతున్నది. శశికల లొంగి పోయింది.  ఆమె  వచ్చి రాజకీయం నడపడానికిఅవకాశం లేనట్లే. లాలూ ప్రసాద్ యాదవ్ "నేను జైలునుండి పరిపాలిస్తాను" అని, తన భార్య రబ్రి దేవికి పట్టం కట్టి, నడిపించినట్ళు, శశికళ పళని స్వామి ద్వారా వ్యవహరించగలరా? 

 

            రాజకీయ చైతన్యం గలిగిన తమిళునాడులొ ఇటువంటి దురాగతాలు చోటు చేసుకొవడం, బారత ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ.  పంచాయత్ సభ్యుల  మాదిరి, విధాన సభ సభ్యులను ఒక రిసార్ట్, క్యాంపులో , ఉంచడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే.  జయలలిత కూడా లంచగొండిగా,  దోషిగా సర్వోన్నత న్యాయాలయం నిర్ధారించిన తరుణంలొ జయలలితకు స్మారక నిర్మాణం ప్రతిపాదనకు తిలోదకాలె గాక, విధాన సభలో, ప్రభుత్వ కార్యాలయాలలొ, వారి చాయాచిత్రం కూడా ఉంచరాదు. ఇది దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘమైన, బహుశా అతి ఎక్కువ కాలం తమిళ రాజ్యాన్ని పాలించిన ఒక నాయకురాలి విషాధ గాథ అంటె తప్పా? ఇటువంటి తలవంచుకునె దుస్థితి ఎవరికి రాకూడదు.  కన్నడ వచన కవి, సంఘ సంస్కర్త బసవణ్న అన్నారు: శరణుల గుణం మరణంలో చూడాలి.( శరణర గుణ మరణదల్లి నోడు.)