Asianet News TeluguAsianet News Telugu

మొదటి సారి ఆదాయపు పన్ను కడుతున్నారా, ఇవి గుర్తుంచుకోండి

points you need to remember while file it returns for first time

మొట్ట మొదట ఆదాయపు పన్నుకట్టడం ఒక ఉద్వేగభరితమయిన అనుభవం. అదే సమయంలో అదిచాలా గందరగోళంగా ఉంటుంది. విసుగెత్తిస్తుంది. ఎందుకంటే, ఆదాయపు పన్నుచట్టంలో పన్నులకు, కూడికలకు, తీసివేతలుకు, మినహాయింపులకు ఉండే రూల్స్ దారి దొరకని కారడవిలా కనిపిస్తాయి.వాటికి తోడు డెడ్ లైన్లు భయపడిస్తాయి.

ముందుగా గుర్తుంచుకోవలసి విషయం... మీ ఆదాయం రు.2.5లు దాటితే మీకు ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వుంటుంది. ఇన్ కంటే ఏమిటో తెలుసా, మీ జీతం,ఇంటి వంటి ఆస్తుల మీద వచ్చే అద్దెలు, ఏవయిన అమ్మినపుడు చేకూరే డబ్బు, ఏవైనా వ్యాపారాలుంటే వాటి ద్వారా మీకు లభించే ఆదాయం అన్నీ కలిపి మీ ఇన్ కమ్ అవుతాయి. రిటర్న్స్ ఫైల్ చేయకపోతే, ఇన్ కం టాక్స్ (ఐటి) శాఖ మీ మీద జరిమాన విధిస్తుంది. మీ వార్షిక ఆదాయం రు. 2.5లు మించకపోతే, మీ మీద పన్ను పడదు. అయినా సరే, మీరు ఇన్ కంటాక్స్ రిటర్న్స ఫైల్ చేయడం మంచిది. ఎందుకంటే, ఎపుడైన బ్యాంకు లావాదేవీలు జరిపినపడు ఆ డాక్యమెంట్లు పనికొస్తాయి.

ఇన్కం టాక్స్ రిటర్న్స్ ఆన్ లైన్ (ఇ-పైలింగ్) ద్వారాగాని మీరు స్వయంగా ఐటి శాఖకార్యాలయానికి గాని వెళ్లి జూలై 31 లో ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఒక వేళ మీ ఆదాయం రు.5 లు పైబడితే, మీరు తప్పనిసరిగా ఆన్ లైనే రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇ-ఫైలింగ్ సురక్షిత,సళువు కావడంతో వ్యక్తిగతంగా  ఫైల్ చేయడం కంటే  మంచిదని వేరే చెప్పనవసరం లేదు. అంతేకాదు,ఇంటర్నెట్ ఉంటే చాలా ఎక్కడి  నుంచైనా ఫైల్ చేసేయవచ్చు. ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ (https://incometaxindiaefiling.gov.in)లో రిజిస్టర్ చేసుకునే మీ అంతకే మీరే రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.

 

ఇపుడు మొదటిసారి ఇన్ కంటాక్స్ కట్టాలనుకుంటున్నవారు తెలుసుకోవలసి అంశాలేమిటో చూద్దాం.

 

ఇన్ కం టాక్స్ స్లాబ్స్ , వాటి కి సంబంధించిన టాక్స్ వివరాలు.ఆదాయం ఉన్న ప్రతిఒక్కరు ఆదాయపు పన్ను పరిధిలోకి రారు. రు.2.5 ఆదాయం దాకా పన్నేమీ ఉండదు.  ఈ

ఆదాయం స్లాబ్స్

ఇన్ కం టాక్స్ వివరాలు

వార్షికాదాయం రు. 2.5 లక్షల దాకా

ఆదాయపు పన్ను లేదు

రు 2.5 లక్షల నుంచి రు. 5 లక్షల దాకా

2.5లక్షల పైబడిన ఆదాయంలో పది శాతం.

5 లక్షల నుంచి 10 లక్షల దాకా

20% 5 లక్షల పైబడిన ఆదాయంలో 20 శాతం

10 లక్షల పైన ఆదాయం వుంటే

10 లక్షల పై ఆదాయంలో 30 శాతం పన్ను

 

(ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. రు. 2.5 లక్షల నుంచి రు. 5లక్షల ఆదాయానికి  10  శాతం పన్ను అనేది కేవలం 2016-17 సంవత్సరానికి టాక్స్ కట్టే వారికి మాత్రమే.  2017-18 సంవత్సరానికి కట్టే వారికి ఇది 5 శాతానికి తగ్గిచారు.)

ఇపుడు మీ ఆదాయానికి ఎంత పన్ను కట్టాలో మీరు తెలుసుకోవచ్చు.ఉదాహరణకి మీ వార్షికాదాయం రు.12 లక్షలనుకుందాం. మీ దగ్గిర ఎలాంటి సేవింగ్స్ ఇన్వెస్ట్ మెంట్స్ , మినహాయింపులు లేవనుకుందాం. అపుడు టాక్స్ ఇలా ఉంటుంది.

2.5 లక్షలకు 10 శాతం = 25,000

5 లక్షలకు 20 శాతం = 1,00,000

2 లక్షలకు 30 శాతం = 60,000

అంటే మీరు కట్టాల్సిన పన్ను మొత్తం రు.1.85 లక్షలు. దీని మీద మరొక 3 శాతం సెస్ ఉంటుంది.

 

అయితే,ఆదాయపు పన్ను చట్టంలోని అనేక సెక్షన్ల కింద, క్యాటగరిల కింద మీకు పన్నునుంచి అనేక మినహయింపులుంటాయి.

 

పన్నుల పరిధిలోకి వచ్చే కొన్ని రకాల అసెట్స్ లో మీరు పెట్టుబడి పెట్టినపుడు అదాయపు పన్ను నుంచి కొంత మినహాయింపు వుంటుంది.సేవింగ్స్ రూపంలో మీరు రరు.1.5 దాకా పెట్టుబడి పెడితే, అదాయపు పన్ను చట్టంలోని 80C కింద పన్ను మినహాయింపు వుంటుంది. ఇలాగే ఇంటి లోన్ మీద చెల్లించె మొత్తం, ఎన్ పిఎస్,  హెల్త్ ఇన్స్యూ రెన్స్ తదితర క్యాటగరీ లనుంచి కూడా మీరు మినహాయింపు పొందవవచ్చు.సెక్షన్ 80 సి కింద రు.1.5 లక్ష వెచ్చిస్తే,  పన్నుపరిధిలోకి వచ్చే మీ ఆదాయం ఆ మేరకు తగ్గుతుంది. అంటే, ఈ 1.5 లక్ష పోనూ మిగతా మొత్తానికే మీరు పన్ను కడతారు.పైన ఇచ్చిన 12 లక్షల వార్షికాదాయం ఉదాహరణకు ఈ నియమాన్ని వర్తింప చేద్దాం.  1.5లక్షలు మీరు 80సి కింద వెచ్చిస్తే,మీరు పన్ను కట్టాల్సింది కేవలం రు. 10.5 లక్షలకే. మీరు కంటే పన్ను రు.1.4 లక్షలకు పడిపోతుంది.అపుడు మీ కట్టాల్సిన పన్ను ఇలా ఉంటుంది.

( 10 శాతం(రు.2.5లక్షలు)+ 20 శాతం(5 లక్షలు)+30 శాతం(50,000 మాత్రమే). దీనికి మూడు శాతం సెస్సు.

పన్ను కట్టేటపుడు  సమర్పించాల్సిన పత్రాలు

1.ఆదాయపు పన్ను కట్టాలంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్ నెంబర్ )తప్పని సరి.

2. ఇంటి అడ్రసు ధృవీకరణ పత్రం, వ్యక్తి గత ధృవీకరణ పత్రం(దీనికి పాన్ కార్డు కూడా వాడవచ్చు)

3. మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ( మీకు రిఫండ్ వున్నా లేకపోయినా, బ్యాంకు వివరాలు అందచేయాలి)

3. ఈ ఏడాది జూలై 1  నుంచి పాన్ కార్డు, అధార్ కార్డలను అనుసంధానం చేయడం తప్పనిసరి చేశారు.

4. ఉద్యోగాలతతో ఉన్నవారు ఫాం-16 అనే పత్రం సమ్పర్పించాలి.  ఈ ఆదాయం నుంచి మీ ఆఫీసు వారు కోత విధించిన పన్నులు వివరాలు తెలపేదే ఫాం-16.

5. 80సి కింద మీరు పన్ను మినహాయింపు కోరుతున్న పక్షాన ఈ ఇన్వెస్టమెంటుల సర్టిఫికెట్స్ సాక్ష్యం  సమర్పించాలి.

6. ఇంటిరుణం రీపేమెంట్ కింద పన్న మినహాయయిపు కోరుతున్న పక్షంలో అడ్రసు ధృవీకరిస్తూ, హోం లోన్ గురించి బ్యాంకు ఇచ్చే సర్టిపికేట్ కూడా సమర్పించాలి.

7. మీకు పిక్స్ డ్ డిపాజిట్లు, బంగారు, ఇతర ఆస్తలు, మ్యూచ్యువల్ పండ్స్ ,లాభాలు ఆర్జించిపెట్టిన ఈ క్విటీలు ఉన్నట్లయితే, వాటినిఆదాయం డిక్లరేషన్ లో సమర్పించాలి. లాంగ్ టర్మ్,షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రేట్లు వేర్వేరుగా ఉంటాయి.  ఈ వివరాలు తెలిసినపుడు టాక్స్ కరెక్టుగా చెల్లించేందుకు వీలవుతుంది.

మీకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిపి సమాచారాన్ని బట్టి ఆదాయం పన్నులు చెలించడం సులవుతుంది. లేదా జటిలమవుతుంది. అందువల్ల , జీతపు రాళ్లు కాకుండా ఇతరత్రా ఆదాయం ఉన్నపుడు అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ ను సంప్రదించడం మంచిది.

 

points you need to remember while file it returns for first time

 

 

 

(రచయిత  BankBazaar.com సిఇవొ)