Asianet News TeluguAsianet News Telugu

అమానుషంగా మారిన పరీక్షా విధానం

Examinations are killing the education in our institutions

ఎవ్వారు పెట్టార్రా ఈ పరీక్షలు? మా ప్రాణానికి! ఇవి లేక పోతె హాయిగా బదికెవాళ్ళం గదా?  

 

పరీక్ష ఎవరు ఎప్పుడు కనుగొన్నారోగాని, పంతొమ్మిది నాగరీకతలలొ పదిహేడు నశించి పోగా, రెండు సజీవంగా ఉన్నయని చరిత్రకారుడు ఆర్నోల్డ్ టొయిన్ బీ  (Prof.Arnold Toynbee)  అభిప్రాయ  పడ్డారు.  అవి,  చైనా, భారతదేశం.

 

చైనాలొ మాత్రం వెల్ దొరల కాలమునుండి (220-265). తాంగ్ వంశముపరిపాలనలోనూ, (960-1279), సొంగ్ పరిపాలనలోనూ, (960-1279) ప్రభుత్వ ఉద్యోగాలకొరకు పరీక్షించేవారని చరిత్ర కారుల అభిప్రాయం. 

 

మన దేశానికి వస్తే, 19 వ శతాబ్ది మొదటి భాగమువరకు,   పాలకులు వారికి ఆంతరంగికులుగా ఉన్నవారిని, వారి వారి విజ్ఞతను బట్టి ఎన్నుకొనేవారు. ఆ శతాబ్దం మద్య భాగములొ,  రాజారామ్మోహన్ రాయ్  ప్రొద్భలముతొ థొమస్ బాబింగ్టన్ మెకాలె (1800-1859) సిఫారస్ తో, ఈస్ట్ ఐండియా కంపెని గవర్నర్ జనరల్  లార్డ్ విల్లియమ్ బెంటిక్ (1774 –1839) ఇప్పుడున్న పరీక్షా పద్దతిని పద్దతి  ప్రవేశ పెట్టినాడన్నది వాస్తవం.   ఐతే ఈ పద్దతి మొదలయినప్పుడి నుండి  ఈవ్యవస్థలో చదువుకొన్న వారే ఎక్కువగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.   జాతీయ ఉద్యమాలలొ పాల్గొన్నవారిలొ, వకీళ్ళు, అధ్యాపకులు, డాక్టర్లే ఎక్కువ మందిగదా! విద్యార్థి దశలోనే ఉద్యమాలలో దూకి, లేదా వృత్తి, ఉద్యోగాలకు తిలోదకాలిచ్చి, దేశ సేవయే ప్రథమ కర్తవ్యంగా భావించినది కూడా ఈ పద్దతిలొ చదువుకొన్న వాళ్ళే!

 

                          ఆ రోజుల్లొ పురపాలక సంఘాలు, జిల్లా బోర్డ్ లు మాత్రమే ఉండేవి. అక్కడక్కడ, ప్రభుత్వ గ్రాంట్లతో   క్రిష్టియ్ మిషనరీలు, స్వంచ్ఛంద సంస్థలు, బడులను నడుపగా, ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నత విద్యాసంస్థలను నెలకొల్పాయి. అవి నిజమయిన విద్యా సంస్థలు. ఇప్పుడు మనకుండేది కేవలం శిక్షణ సంస్థలు. అప్పుడు విద్యకి ఎంత ప్రాముఖ్యతొ ఉండేదో,  అంతే శ్రద్ధతొ జీవితానికి అవసరమున్న పాఠ్యేతర అంశాలను  చదివించెేవారు, నేర్పించేవారు. అక్కడి చర్చా కూటమిలొ పాల్గొన్నవాళ్ళే, విద్యా సంస్థలు క్రమం తప్పకుండా  ప్రచురించిన వార్షిక సంచిక (Magazine) లలో తమ రచనలను ప్రచురించి, రాష్ట్ర, జాతీయ, అంతర్రాష్ట్రీయ నాయకులు,

 

           ఆ నాడు చదువుకొరకే అంటే ప్రపంచ జ్ఞానం కొరకు మాత్రమే విద్య ఉండేది. స్వాతంత్రానంతర రోజుల్లో చదువు ఉద్యోగం కొరకు అనే భావన ఏర్పడింది. ఇపుడు చదువుకొన్న వాడు ప్రభుత్వ ఉద్యొగమే చెయ్యాలి, ఇతర సాంప్రదాయ బద్ధమైన పౌరోహిత్యం, అర్చకత్వమ్,  వ్యాపారం, వ్యవసాయం, చెయ్యడం తగదు. ఆంగ్లం నేర్చుకొన్నవాడే మేధావి అనే మనస్తత్వం  స్వాతంత్రం పూర్వముకంటె ఇపుడు ఎక్కువ.

 

 1990  దశకములొ మొదలయిన,  సరళీకృత అర్థిక, పారిశ్రామిక విధానాలు ఈ మనోభావాన్ని శాశ్వతీకరించాయి.

 

 తల్లిదండ్రులు కుడా అమ్మ, నాయన కంటే  "మమ్మి," "డాడి," అని పిలుపించుకున్నపుడే ఎక్కువ అనంద వ్యక్తం చేస్తారు. "అమ్మా" అని నోరునిండా పిలిచె ఈ దేశములొ  కన్న తల్లుల స్థానం ఇపుడు ఇంత దిగ జారింది.  ఇది ప్రవేశ పరీక్ష, వాటికి శిక్షణ, దాని ఆధారంగా ఉద్యోగం  అనే సమాజం నుంచి వచ్చిన దుష్ఫ్రభావం.

 

             మేము చదువుకొంటున్న రోజులలొ,  వేసవి సెలువు తరువాత విద్యాసంస్థ  తెరిసిన రోజున,  పరీక్ష తేదీలు కూడా తెలిసేవి. ఉదా: ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్ష మార్చ్, 15. అది ఆదివారమైతె మరుసటి రోజు. పరీక్ష కేంద్రాలు మన సంస్థలే. మన సంస్థ ముఖ్యోపాధ్యాయులు, ప్రిన్సిపాలులే  పరీక్ష నిర్వాహకులు. ప్రశ్నాపత్రం  వారి బీరువాలోనే భద్రంగా ఉండేది. మన అధ్యాపకులు, ఉపన్యాసకులే వారికి, సహయకులు. మన సంస్థ సిబ్బందే వారికి అండదండలు. ప్రశ్నాపత్రాలు ఎక్కడ బట్టబయలు(లీక్) కాలేదు.

 

పర్యవేక్షణ  లోపం కనబడలేదు.   అప్పుడు ప్రశ్నా పత్రిక రవాణాకు గాని, జవాబు పేపరుల పంపడానికి గాని, తపాలా శాఖయె దిక్కు.  కంపూటర్ లేదు. ఫోన్ లు లేవు. జూన్, మొదటి వారములొ ఫలితాంశం, పదివ తారీకున ప్రమాణ పత్రాల (Certificate) పంపిణీ.  ముందు 1953 వరకు, మనకు మద్రాస్ (చెన్నై) రాజధాని. (ఆనాటి మద్రాస్ రాష్ట్రం అంటే  దక్షిణ భారత దేశంలో దాదాపు 50% ).  తరువాత కొన్నాళ్ళు, (1953-56) కర్నూలు  రాజధాని నుంచి అన్ని ఆదేశాలు వచ్చేవి.  ఆ పైన 1956 లో  హైదరాబాద్ చలో.   ఇప్పుడు అమరావతి పరుగు. 1970 దశకం నుంచి పరిక్షలు నిర్వహించే విధానములోనూ, పేపర్ దిద్దే విధానములోనూ ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.  విద్యార్థులకు వారి పాఠశాలలొ కాకుండా, ఇతర పాఠశాలలొ, అడపా, దడపా, (jumbling ) పరీక్షా కేంద్రాలు. స్పాట్ వాల్యుయేశన్ యజ్ఞం మొదలయ్యాయి. అందులొనూ వైవిధ్యమమైన మార్పులు. ఉదా; ఒక జిల్లా నుండి అన్ని పెపర్లు ఒకే ఊరికి పోవు. పరీక్షా ప్రవేశ పత్రం సంఖ్య మార్చి పంపడం. ఎన్ని రకాల జాగ్రతలు పడినా మాల్ ప్రాక్టీస్ అనే పెనుభూతం వెంటాడుతూనే ఉంది. 

 

         ఆ నాడు విద్యార్థుల సంఖ్య  వేలలొ ఉండేది; ఇప్పుడు అది లక్షలకు పెరిగింది. ఈ సంగతి నాకు ఎరుక. దానికి తగినట్లు ఈ సౌకర్యాలు అవసరం. ఐతే పరీక్ష్ కేంద్రాల మార్పిడి, ఒక్క నిమిషం ఆలస్యంమైనా ప్రవేశం నిరాకరణ, ప్రవేశ పత్రాల నిరాకరణ,  వేరే పాఠశాలల అద్యాపకులు పర్యపేక్షలుగా వ్యవహరించుట,  దిద్దెే విధానంలలో  విలువలు కొరవడ్డాయి.  దీనికి ముఖ్య కారణం, శిక్షణ వ్యవస్థలొే యాజమాన్యం విజృంభణ. దీనికి తోడుగా ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల అధ్యాపకులలొ నిష్పృహ, నిర్లక్ష్య వైఖరి.  ఆ రోజులలొ పరీక్షకు చాలా దూరమునుండి వచ్చేవాళ్ళ అనుకూలముకొరకు, అర్ధ గంట సమయమిచ్చేవారు.

 

మేము  SSLC పరీక్ష రాసే రోజులలో మా ముఖ్యోపాధ్యాయులు పిఎన్  భోజ రావుగారు దగ్గర ప్రాంతాల విద్యార్థులు రాకుంటే  వారింటికి  జవానులను పంపేవారు. ఆ జవానులు నిష్ఠగా విద్యార్థులను పిలుచుకు వచ్చెేవారు.

 

1954 లో నేను ESLC (Elementary School Leaving Certificate - 8వ తరగతి) చదివాను. ప్రతి రోజు మా పల్లెనుండి, బ్రహ్మావర అనే పట్టణానికి 8 కిమీ నిడిచాను. 1957 లో SSLC రాయడానికి బార్కూరుకు 5 కిమీ నడిచాను. అది కర్ణాటక  ఊడుపి జిల్లాలోని కూరాడి అనే మారు మూల పల్లెనుండి. నాకంటె ఎక్కువ నడిచినవారు ఉన్నారు.  పరీక్ష గదినుండి విద్యార్థి అర్ధ ఘంట తరువాత నిష్క్రమించవచ్చు. అనుమతి పత్రాలు (hall ticket) ఇవ్వని ఉదంతాలు లేనే లేవు.   ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలలొ ఎంతో మంది దూరమునుండి వచ్చేవారున్నారు.  రెండు పూటలు పరీక్ష. మూడు రోజులలొ ముగింపు. పట్టణాలలొ కూడా వాహన సౌకర్యాల  కొరత, వాహనాల రద్ది, ఇలాంటి కారణాలవల్ల ఆలస్యం కావచ్చు గదా! ఓక చిన్న ఉదాహరణ:  మేము SSLC పరీక్ష రాసే రోజులలొ  మా ముఖ్యోపాధ్యాయులు. పి.ఎన్.భోజ రావుగారు దగ్గర ప్రాంతాల విద్యార్థులు రాకుంటె వారింటికి జవానులను పంపేవారు. ఆ జవానులు నిష్ఠ గా విద్యార్థులను పిలుచుకు వచ్చెేవారు.  భోజ రావుగారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశస్తి పొందడమే కాకుండా, "Teaching of English in Indian Schools"  అనే వ్యాసానికి జాతీయ పురస్కారం అందుకున్నారు.  

 

ఇపుడు పరిస్థితి చూడండి,

 

‘కాళ్ళు పట్టు కొంటాను సార్, పరీక్ష  రాయనివ్వండి సార్’.  అని కాళ్ళు పట్టుకుంటున్న విద్యార్థిని.  అంతా సిగ్గు పడాల్సిన సంఘటం ఇది.  చాల చోట్ల హాల్ టికెట్లు ఇచ్చే దిక్కులేదు... ఆ దిక్కు మాలిన నిమిష నిబంధన మాత్రం ఘనమయిన సంస్కరణ అని గొప్పగా చెప్పుకునె ’మైండ్లెస్’ విద్యాశాఖ అధికారులకు జోహార్లు. ... దీన్ని సమర్థించే పెద్ద మనుషులకు మరి మరీ జోహార్లు.

 

నిమిషం లేటైనా పరీక్షకు రానివ్వం అనెే నిబంధ  అధికారుల అమానుషత్వానికి ప్రతీక... ప్రభుత్వం అజ్ఞానానికి పరాకాష్ట; అహంకారానికి నిదర్శనం. అర్థరహితమైన ఈ నిబంధన కొనసాగడం అహేతుకం. దీనిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు కూడ నిరసించాలి. ఒక విద్యార్థి పరీక్షకి  పది నిమిషాలు లేటుగా వెళితే అతడె టైం నష్ట పోతాడు. దానిని "మాల్ ప్రాక్టీస్"  కింద, దారుణ నేరం కింద భావించి పరీక్షకి, హాజర్ కాకుండా ఆపేయడం సిగ్గుచేటు.

 

దీనిమీద ఎంత వ్యతిరేకత వచ్చిందో ఈ వాట్సాప్ సందేశం చెబుతుంది.

 

“ఒక్క రైలు, ఒక్క బస్సు టైముకి నడవదు. ఒక్క మీటింగ్ కి ... ఒక నాయకుడు చెప్పిన టైముకి రాదు. ప్రభుత్వం చెప్పిన ఏ పని ... ఇచ్చిన ఏ హామి సకాలములో అమలు కాదు. అంతెందుకు, .. ఏ రెండు వాచీలు ఒకే టైము చూపించవు..... ఇలాంటి పరిస్థితి అడుగడుగునా ఉన్నఈ దేశంలొ విద్యార్థి మాత్రం పరీక్షకి నిమిషం కూడా లేటువకూడదు అనడం దారుణం... యేళ్ళ తరబడి ప్రభుత్వం ఆఫీసులలో ఫైళ్ళు జాప్యం. తరతరాలుగా ప్రభుత్వం అధికారులు విధులకు  రావడం లేటు.... కాని Students Exam ఒక్క నిమిషం లేటయితె ఆ అవకాశం కోల్పోవడమే  ,,, అన్యాయము కదా...? నిమిషం లేటు అనేది నిర్ణయించేదెవరు...? వాచ్? నీదా, నాదా? Principal దా?". వాచ్ మన్ దా? College watch & Watchman వాచ్ ఒకే  time చూపిస్తున్నాయా... ? విద్యావిధానమే బాగలెదని ఆవేదన పడుతుంటె, ఈ నిమిషం /అరనిమిషం గోలెంటి?  బుర్రతక్కువ అధికారులు. దయచేసి ఒక నిమిషం నిబంధన తొలగించాలి. కొనసాగించడానికి వీలేలేదు.  ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు షెర్ చేసి ప్రశ్నించండి... మీ శంకర్ నాయక్.” ఒక వాట్సాప్  సందేశం.  

 

        ఇందుకే ఇది పరీక్షా కాలం  (Season) కాదు:  "పరీక్షా జ్వరం" (Exam Fever). ఈ జ్వరం క్రిస్మస్/ సంక్రాంతి సెలువులు దాటి విద్యాసంస్థలు పునః ప్రారంభం కాగానే మొదలవుతుంది. 19 వ శతాభ్డం ఆఖరి దశాబ్దిలొ రాజాగోపాలాచారిగారు మద్రాస్ ప్రభుత్వం మెట్రికులేషన్ (SSC) పరీక్షలు రాశారు. ఆంగ్ల ప్రశ్నా పత్రములొ ఒక ప్రశ్న.   "Make the sentences of your own by using the following words.  1. Botheration. 2.......10". Rajaji wrote; "Matriculation examination is a botheration to the Indian Students population, whose occupation is cultivation."  Maximum mark was one for each word. Rajaji was awarded 2 for this sentence; i.e. 200%.

 

 ఈ రోజు వ్యవసాయ కూలీల పిల్లలు కూడా పరీక్షలు రాస్తున్నారు అనె నిజాన్ని మన పాలకులు గ్రహించాలి.  భారతీయ ఆంగ్లాన్ని సృష్టించిన ఒకరుగా గుర్తించబడ్డ ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల రచయిత అర్. కె.నాయణ్ గారు, విద్యా సంవత్సరాన్ని మూడు భాగాలుగా విభజించారు: 1. చేర్చుకొవుట, విద్యార్థి సంఘాల ఎన్నికలు మరియు ఉద్ఘాటనలు, 2. ఉద్యమాలు, స్ట్రైక్స్, 3. సమారోపాలు, పరీక్షలు. ఇది 1960, 70, దశాబ్దాలలొ ఉన్న వాస్తవాలు.  

 

పరీక్షలు ఎప్పుడు విద్యా సంవత్సరం అనెది లేనేలేదు అంటె తప్పు కాదు.  జూన్ 1975 నుండి, మార్చ్ 1977 వరకు విధించిన విద్యా వ్యవస్థలొ క్రమశిక్షణను పునరుద్దరించడం.  ఆ తరువాత ఆందోళనాలు అంత ఉదృతంగా కనుబడుట లేదు. ఈ మధ్య కాలంలో హైదారాబాద్, కేంద్ర విశ్వవిద్యాలయములొ జరుగినకొన్ని ఆందోళనలు తప్ప, ప్రమాదకర పరిస్థితిలొ  స్ట్రైక్ లు జరగడం లేదు. రాబోయె రోజుల్లొ ఇవి ’ఉదృత స్థాయికి చెరుకోలేవు’ అని మాత్రం చెప్పలేము. కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం సబబు. అవి ”ఒక్క నిమిషం ఆలస్యం" లాంటి కరాళ స్వరూపాన్ని దాల్చడం మరి ’పిట్టపై బ్రహ్మాస్త్ర్రం’ అనిపిస్తుంది.  ఇంత పకడ్బంది ఉన్నప్పటికి సామూహిక కాపిగొట్టడం వంటి దురాచారాలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇది కూడా నైతిక విలువలతొ కూడిన సమస్య. చట్టం నైతిక విలువలను భోదించగలదేగాని, వాటిని నీతి లేని సమాజములొ అమలు చేయించలేదు.   

 

              సంస్కరణలొ చాలా దూరం ప్రయాణం చేశాము. వెనుకు/తిరుగు  ప్రయాణం అసాధ్యమనె చెప్పాలి.  ఇది ఒక మహా ప్రవాహం. ఇందులొ ఎదురీత అసాధ్యం. విశ్వనాథవారన్నట్టు ప్రవాహరంతో పాటు ఈదితె, ఎక్కడొ ఒక చోట, తటి చేరుకొగలమనె ఆశ.   విద్యా వ్యవస్థకు సంబంధించి ఇకా ఎన్నెన్నో విషయాలను ముచ్చటించుకొవాలి. సందర్భం వచ్చినప్పుడల్లా మీ ముందు వస్తాను. అంతవరకు, సెలవు. 

 

(* కురాడి చంద్రశేఖర కల్కూర ఉడుపి నుంచి వచ్చి కర్నూలులో స్థిరపడ్డారు. మొదటి  ఉడిపి హోటల్ వారిదే. ఆయన ఉన్నత విద్యాభ్యాసం కర్నూలులోనే సాగింది.)