నిజామాబాద్: నిజామాబాద్ నవీపేటలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుడు, వ్యాపారి కొంచ రమణారెడ్డి హత్య విషయంలో భార్య పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రమణారెడ్డి భార్యను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. భార్యనే రమణారెడ్డిని చంపించిందని ఆయన తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు  ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

రమణారెడ్డి శుక్రవారం ఉదంయ ఇంటి ఆవరణలో హత్యకు గురయ్యారు. ఫోన్ మాట్లాడుతుండగా దుండగులు మారణాయుధాలతో ఆయనపై దాడి చేశారు. రక్తం మడుగులో పడి ఉన్న తండ్రిని రెండో కూతురు చూసి బిగ్గరగా ఏడ్వడం ప్రారంభించింది. దీంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గేటు తీసుకుని లోపలికి వచ్చిన దుండగులు ఫోన్ మాట్లాడుతున్న ఆయనపై దాడి చేశారు. దాంతో ఆయన అక్కడికక్కడే కూలిపోయాడు. 

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనలో వాళ్లు కీలకమైన ఆధారాలు సేకరించారు. రమణారెడ్డి ఇంటి ఆవరణలో పడేసిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రమణారెడ్డిపై దాడి చేసిన తర్వాత దుండగులు గోడ దూకి పారిపోయినట్లు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు క్లూస్ టీమ్స్ ను, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు.

దాంతో ఎనిమిదేళ్లుగా ఆమె పెద్దకూతురు హరిణి, చిన్న కూతురు హిమబిందులతో కలిసి నిజామాబాద్ లో ఉంటోంది. భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రమణా రెడ్డి హత్యకు గురై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.