సిద్ధిపేట: హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో హోలీ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన రంగులు చల్లుకుంటూ పండగను ఆహ్లాదకరంగా జరుపుకున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు సామాన్యులు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. 

read more  తెలంగాణ బడ్జెట్ 2020: హైలైట్స్

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను హరీష్ ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవసరాలు, ఎన్నికల హామీని దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాలకు సమాన కేటాయింపులు చేపడుతూ బడ్జెట్ ను అత్యుద్భుతంగా రూపొందించారని ముఖ్యమంత్రి, మంత్రులే కాదు ఇతర నాయకులు కూడా హరీష్ పై ప్రశంసలు కురిపించారు. ఇలా గతంలో నీటిపారుదల మంత్రిగా వందకు వంద మార్కులు సాధించిన హరీష్ ఈసారి ఆర్థికమంత్రిగా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటున్నారు. 

ఇక సిద్దిపేట విషయానికి వస్తే అక్కడి ప్రజలందరికి హరీష్ సన్నిహితుడు. ఇక టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కాదు కార్యకర్తల పేర్లను కూడా గుర్తుంచుకుని పిలిచే  ఆయనంటే వారికెంతో అభిమానం. ఇలా  ప్రతి పండగను వారితో కలిసే జరుపుకునే హరీష్ హోలీని కూడా వారితోనే జరుపుకున్నారు. ఇలా మంత్రి కేవలం తన నియోజకవర్గ ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.