Asianet News Telugu

తెలంగాణ బడ్జెట్ 2020: హైలైట్స్

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభ మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది. 

telangana budget 2020: live updates, cm kcr, Harish Rao
Author
Hyderabad, First Published Mar 8, 2020, 10:46 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆదాయ మార్గాల పెంపు:

* రాష్ట్రంలోని ఇసుక, ఖనిజాలు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచేందుకు గాను పకడ్బందీ వ్యూహం అమలు

అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు:

* ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం ఒక్కొక్కరికి రూ. 3 కోట్లు చొప్పున నియోజకవర్గం అభివృద్ధి నిధులు. 
* నిధుల వినియోగానికి త్వరలోనే మార్గదర్శకాలు

శాంతి భద్రతలు:

* ఈ బడ్జెట్‌లో పోలీస్ శాఖకు రూ.5,852 కోట్లు కేటాయింపు

రహదారులు- భవనాలు:

* రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణకు ఈ బడ్జెట్‌లో రూ. 750 కోట్లు కేటాయింపు
* కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నిర్మాణాల కోసం ఈ బడ్జెట్‌లో రూ.550 కోట్ల రూపాయల కేటాయింపు
* రవాణా, రోడ్లు, భవనాల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.3,494 కోట్లు కేటాయింపు

దేవాలయాల అభివృద్ధి:

* ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలోని వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయింపు
* రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు, వాటి నిర్వహణ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయింపు
* పూజారులకు అర్చక నిధి ద్వారా వేతనాలు

హరితహారం:

* కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం వారి వారి బడ్జెట్లలో పది శాతం నిధులను హరిత ప్రణాళిక అమలుకు ఖర్చు చేస్తాం
* ఈ బడ్జెట్‌లో పర్యావరణ, అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు

డబుల్ బెడ్ రూం ఇళ్లు:

* రాష్ట్రంలో ప్రస్తుతం 2,72,763 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి
* వచ్చే ఆర్ధిక సంవత్సరంలో లక్షమంది లబ్ధిదారులకు తమ స్వంత స్థలంలోనే ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్ధిక సాయాన్ని అందిస్తాం. 
* ఈ బడ్జెట్‌లో గృహ నిర్మాణాల కోసం రూ.11,917 కోట్లు కేటాయింపు

ఆర్టీసీ అభివృద్ధి:

* ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్ బోర్డు ఏర్పాటు
* ఆ బడ్జెట్‌లో ఆర్టీసీ రూ.1000 కోట్లు

ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ:

* 2018-19 నాటికి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు లక్షా 9 వేల కోట్లుకు పెరిగాయి
* ఐటీ పరిశ్రమను ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, కరీంనగర్ తదితర టైర్-2, టైర్-3 నగరాల్లోనూ విస్తరిస్తున్నాం

పరిశ్రమలు:
* ఈ ఏడాది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం బడ్జెట్‌లో రూ. 1,500 కోట్లు కేటాయింపు
* పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రూ. 1,998 కోట్లు కేటాయింపు

విద్యుత్తు రంగం:
* తెలంగాణలో 13,168 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ వచ్చింది
* ఈ బడ్జెట్‌లో విద్యుత్ శాఖకు 10,416 కోట్లు కేటాయింపు

వైద్య రంగం:

* రాష్ట్రంలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యను 9కి పెంచాం
* హైదరాబాద్‌లో ఉన్న 118 బస్తీ దవాఖానాలను 350కి పెంపు
* మరో 232 బస్తీ దవాఖానాల ఏర్పాటు
* ప్రతీ డివిజన్‌లో కనీసం రెండు బస్తీ దవాఖానాలు. ఎస్సీ, ఎస్టీ, మైనారీటీలు, పేదలు ఉండే ప్రాంతాల్లో అదనపు దవాఖానాలు
* తెలంగాణలోని ప్రతి పౌరుడీకి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా అడుగులు
* ఈ బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ. 6,186 కోట్లు కేటాయింపు

విద్యారంగం:

* ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.2,650 కోట్లు కేటాయింపు
* పాఠశాల విద్యాశాఖకు ఈ బడ్జెట్‌లో రూ. 10,421 కోట్లు కేటాయింపు
* ఉన్నత విద్యాశాఖకు ఈ బడ్జెట్‌లో రూ.1,723.27 కోట్లు కేటాయింపు
* సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం కోసం ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయింపు

హైదరాబాద్ నగర అభివృద్ధి:

* హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌ అమలుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయింపు

పంచాయతీరాజ్, మున్సిపల్:

* ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు గాను  పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాం
* నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు, అధికారులుపై చర్యలకు ఈ చట్టం ద్వారా వీలు
* పంచాయతీ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్
* పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో రూ.23,005 కోట్లు కేటాయింపు
* సులభ పద్ధతుల్లో పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు గాను టీఎస్ బీ పాస్ విధానం అమలు
* పట్టణాలు, నగరాల అభివృద్ధికి ప్రతి నెల రూ.148 కోట్లు విడుదల
* పట్టణ మిషన్ భగీరథ పథకం కింద మిగిలిపోయిన 38 మున్సిపాలిటీల కోసం రూ. 800 కోట్లు కేటాయింపు
* మున్సిపల్ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ. 14,809 కోట్లు కేటాయింపు

మహిళా శిశు సంక్షేమం:
* ఈ బడ్జెట్‌లో మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ. 1,200 కోట్ల రూపాయలు కేటాయింపు

ఆత్మగౌరవ భవనాలు:

* రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ఆత్మ గౌరవం ప్రతిబింబించే విధంగా హైదరాబాద్‌లో ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం
* వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో రూ. 4,356.82 కోట్లు కేటాయింపు

అత్యంత వెనుకబడిన వర్గాల సంక్షేమం:

* ఎంబీసీ కార్పోరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* ఇందుకోసం ఈ ఏడాది రూ. 500 కోట్లు కేటాయింపు

కళ్యాణలక్ష్మీ- బీసీల కోసం అదనపు నిధులు:

* కళ్యాణ లక్ష్మీ పథకం అమలుకు ఈ ఏడాది అదనంగా రూ.650 కోట్ల రూపాయలు కేటాయించి, మొత్తం రూ.1,350 కోట్ల రూపాయల  ప్రతిపాదన

మత్స్యకారుల సంక్షేమం:

* రూ.155 కోట్ల 64 లక్షల రూపాయల వ్యయంతో కోట్లాది చేప పిల్లలు, రొయ్య పిల్లలను అందించాం
* 2016-17లో చేపల దిగుబడి 1.99 లక్షల టన్నులు ఉండగా.. 2018-19 ఆర్ధిక సంవత్సరం నాటికి 2.94 లక్షల టన్నులకు పెరిగింది
* ఈ ఆర్ధిక సంవత్సరంలో 90 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తాం
* ఈ బడ్జెట్‌లో పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లు ప్రతిపాదన

కల్లు గీత కార్మికుల సంక్షేమం:

* నీరాను శీతల పానీయంగా అమ్మేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చాం
* చెట్ల పన్ను, పాత బకాయిలను రద్దు చేశాం
* హరితహారం కార్యక్రమంలో భాగంగా తాటి, ఈత వనాలు పెంచుతున్నాం
* ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 6 లక్సల ఎక్స్‌గ్రేషియా

గొల్ల కురుముల సంక్షేమం:

* ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76 లక్షల 92 వేల 678 గొర్రెలను పంపిణీ చేశాం
* వీటి వల్ల గొర్రె పిల్లలు ఉత్పత్తి అయ్యి.. రూ.3,189.60 కోట్ల రూపాయల విలువైన సంపద రాష్ట్రానికి సమకూరింది

చేనేత కార్మికుల సంక్షేమం:

* నూలు, రసాయనాలు, రంగుల మీద 50 శాతం సబ్సిడీ
* బతుకమ్మ చీరల పనిని నేతన్నలకు అందించడం ద్వారా చేతి నిండా పని
* పవర్ లూమ్ కార్మికులకు ప్రతీ నెలా రూ.15,000 వేతనం

మైనార్టీ సంక్షేమం:

* మైనారిటీ విద్యార్ధులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ఇప్పటి వరకు రూ.137 కోట్లు పొందారు
* మసీదుల్లో ప్రార్థనలు జరిపే ఇమాం, మౌజమ్‌లకు 5 వేల రూపాయల గౌరవ భృతిని ఇస్తున్నాం
* హైదరాబాద్ నాంపల్లిలో అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న అనీస్ ఉల్ గుర్ఫా భవనం నిర్మాణం జరగుతోంది
* టీఎస్ ప్రైమ్ పేరుతో మైనార్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం
* మైనార్టీ విద్యార్ధుల కోసం 204 గురుకుల విద్యాలయాలు
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనార్టీ జూనియర్ కళాశాలలను ప్రారంభించనున్నాం
* మైనారిటీ విద్యార్ధుల విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్ షిప్పులు
* షాదీ ముబారక్ పథకం కింద 1,44,301 కోట్ల మంది యువతులు లబ్ధి పొందారు
* 2019-20 ఆర్ధిక సంవత్సరంలో కేటాయించిన రూ.1,369 కోట్ల నిధులు మైనారిటీ సంక్షేమం కోసం ఈ నెలాఖరు నాటికి ఖర్చు చేస్తాం
* ఈ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమం కోసం రూ.1,518.06 కోట్లు కేటాయింపు

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం:

* ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
* ఎస్సీ, ఎస్టీలే సమాజంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్నారు
* ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు
* దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎస్సీ, ఎస్టీ కోసం ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తీసుకొచ్చాం
* ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే, ఈ నిధులు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బదలాయింపు
* ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఖర్చు చేసిన పూర్తి వివరాలను పెన్ డ్రైవ్‌తో పాటు ఎమ్మెల్యేలకు అందించాం
* షెడ్యూల్డ్ కులాల వారి కోసం 268, షెడ్యూల్డ్ తెగల కోసం 169 ప్రత్యేక గురుకుల విద్యాలయాలను నడుపుతున్నాం
* ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు విదేశాలలో విద్యను అభ్యసించేందుకు గాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద రూ.20 లక్షల రూపాయల వరకు ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నాం
* ఎస్సీ, ఎస్టీ గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
* రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ ఛైర్‌పర్సన్ పదవుల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నాం
* ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు గాను టీఎస్ ప్రైడ్, సీఎంఎస్‌టీఈఐ పథకాల ఏర్పాటు
* ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.338 కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లను అందిస్తున్నాం
* ఈ బడ్జెట్‌లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.16,534.97 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.9,771.27 కోట్ల కేటాయింపు

సంక్షేమ తెలంగాణ:

* తెలంగాణ ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది
* దేశంలో సంక్షేమం కోసం అత్యథిక నిధులు ఖర్చు చేస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే
* వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, నేత, గీత కార్మికులకు అందించే పెన్షన్ మొత్తం 1000 నుంచి రూ.2,016 రూపాయలకు పెంచాం
* వికలాంగుల పెన్షన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016 కు పెంచాం
* ఈ ఏడాది నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ అందిస్తాం
* ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య 39,41,976 నుంచి మరింత పెరగనుంది
* గత బడ్జెట్‌లో ఆసరా పెన్షన్లకు రూ. 9,402 కోట్లు కేటాయించగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 11,758 కోట్లు కేటాయింపు

సాగునీటి రంగం:

* ఉమ్మడి రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ దారుణమైన నిర్లక్ష్యానికి గురైంది
* చెరువులు విధ్వంసం కావడం వల్ల తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో పడింది
* తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది
* 46 వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా సాగిన మిషన్ కాకతీయ అమోఘమైన ఫలితాలను సాధించింది
* చెరువుల కింద 15 లక్షల ఆయకట్టు స్ధిరీకరణ జరిగింది
* చెరువులలో నీటి నిల్వ సామర్ధ్యం పెరగడంతో పాటు భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయి
* నీరే ప్రాణకోటికి జీవనాధారం.. మంచినీరు మంచి ఆరోగ్యానికి  సోపానం
* ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అవలంభించిన విధానాల వల్ల తెలంగాణ తీవ్రమైన తాగునీటి కష్టాలను అనుభవించింది
* ఫ్లోరైడ్ విషం నిండిన నీటిని తాగడం వల్ల ఎముకలు బలహీనపడి, నడుములు వంగి తెలంగాణ బిడ్డలు దురవస్థలను అనుభవించారు
* ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు వర్షాకాలంలో కలుషిత నీటిని తాగి మృత్యువాత పడ్డారు. 
* ఈ పరిస్ధితిని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో మిషన్ భగీరథ పథకానికి రూపుదిద్దారు
* నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు లభిస్తోంది
* మారుమూల ఆదివాసీ గ్రామాలకు కూడా నేడు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతోంది
* తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్లలో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడలేదని ఇండియన్ నేచురల్ రిసోర్సెస్ ఎకానమిక్ అండ్ మేనేజ్‌మెంట్ ఫౌండేషన్ ఇటీవల ప్రకటించింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా దక్కిన సార్థకతకు ఒక నిదర్శనం

* కాళేశ్వరం ప్రాజెక్ట్ తొలి ఫలితం కరీంనగర్, జనగాం, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లా రైతులకు అందింది
* కాళేశ్వరంకు గుండెకాయ వంటి మిడ్‌మానేరు 24 టీఎంసీల నీటితో నిండు కుండలా మారింది
* రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపొచమ్మ సాగర్‌ల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తాం
* ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా అన్ని రిజర్వాయర్లు, వాటికింద ఉండే చెరువులు, కుంటలు నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యం
* కరువు పీడిత ప్రాంతాలైన పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల రూపు రేఖలు మార్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల పట్టుదలతో ప్రభుత్వం నిర్మాణ పనులను జరిపిస్తోంది
* కాళేశ్వరం లాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను అనతి కాలంలోనే పూర్తి చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది
* టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేందుకు నడుం బిగించింది
* సమైక్య రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్ట్‌లు నత్త నడకన సాగాయి
* ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 1000 చెరువులను నీటితో నింపాం
* పాలమూరులో వలసలు తగ్గాయి, వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగింది
* మెదక్ జిల్లాలో సింగూరు కాలవ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసి 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాం
* పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నాం
* ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్ట్‌ను 11 నెలల రికార్డు సమయంలో పూర్తి చేశాం
* పాలమూరు జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని 8 నెలల కాలంలో పూర్తి చేశాం
* ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సంకల్పంతో సీతారామ ప్రాజెక్ట్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది
* సీతారామ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు లభిస్తుంది
* సాగునీటి రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.11,054 వేల కోట్లు 

పాడి పరిశ్రమ- అభివృద్ధి:

* పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలు
* సమైక్య రాష్ట్రంలో విజయ డైరీ రూ.30 కోట్ల నష్టాలతో మూతపడే స్ధితి
* ఉద్దేశ్యపూర్వకంగా విజయ డైరీ నిర్వీర్యం
* టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా విజయ డైరీ లాభాల్లోకి
* 2017-18, 2018-19 ఆర్ధిక సంవత్సరాల్లో విజయ డైరీకి రూ.35 కోట్ల లాభాలు
* సంస్థకున్న రూ.25 కోట్ల అప్పు చెల్లింపు, రూ.16 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్
* పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రైతుల నుంచి సేకరించే పాలపై లీటర్‌కు 4 రూపాయల ప్రోత్సాహం
* 99,282 మంది పాడి రైతులకు మేలు
* 2014-15 నుంచి 2018-19 ఆర్ధిక సంవత్సరం వరకు రూ.248.03 కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా పాడి రైతులకు చెల్లించాం
* పాడి రైతులకు అందించే ప్రోత్సాహకం కోసం ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు

రైతు వేదికలు:

* రైతులు పరస్పరం చర్చించుకోవడానికి రైతు వేదికలు
* రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఐదు వేల కస్టర్లకు ఒకటి చొప్పున రైతు వేదికలు
* ఒక్కో రైతు వేదిక నిర్మాణం కోసం రూ.12 లక్షలు
* రైతు వేదికల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో రూ.350 కోట్లు

రైతు బంధు సమితులు:

* రైతు సమన్వయ సమితుల పేరును రైతు బంధు సమితులుగా మార్పు
* అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే ఈ సమితుల లక్ష్యం

మైక్రో ఇరిగేషన్:

* బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం
* మైక్రో ఇరిగేషన్ కోసం విరివిగా నిధులు
* డ్రిప్ ఇరిగేషన్ కోసం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు 100 శాతం, సన్న చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ
* ఇప్పటి వరకు 2,49,200 మంది రైతులకు ఈ పథకం ద్వారా రూ.1,819 కోట్ల రూపాయల లబ్ధి
* ఈ ఏడాది మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాల కోసం రూ.600 కోట్లు

కనీస మద్ధత ధర:

* వరి, పత్తి, మొక్కజోన్న, కందులు కొనుగోలు చేయడానికి కేంద్రాలు ఏర్పాటు
* కంది రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేసి పంట కొనుగోలు
* ఈ బడ్జెట్‌లో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్ కోసం రూ.1,000 కోట్లు

ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం:

* పండ్లు, కూరగాయల సాగులో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించాలి
* రాష్ట్రంలో తోటల పెంపకానికి పరిజ్ఞానం, పరిశోధనను పెంపొందించేందుకు గజ్వేల్‌కు సమీపంలోని ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, జీడిమెట్ల, ములుగులో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సు ఏర్పాటు చేశాం

సకాలంలో విత్తనాలు- ఎరువులు:

* టీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి ప్రతి ఏటా ఎండాకాలంలోనే ఎరువులు, విత్తనాలు తెప్పించి గోదాముల్లో నిల్వ చేస్తోంది
* సమైక్య రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్ధ్యం 4.17 లక్షల మెట్రిక్ టన్నులు
* టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా 22.47 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాములను అందుబాటులోకి తెచ్చింది
* 2013-14లో విత్తనాల సబ్సిడీ కోసం రూ.76.71 కోట్లు ఖర్చు చేశారు
* 2019-20 సంవత్సరంలో రూ.142 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విత్తనాల సబ్సిడీకి అందించింది

రైతు రుణమాఫీ:

* ఎన్నికల మ్యానిఫెస్టో లక్ష్యం బ్యాలెట్ బాక్స్‌లు కాదు, ప్రజల బతుకు నిలబెట్టడం
* 2014లో లక్ష రూపాయల లోపున్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది
* ఇప్పటికే రూ.16,124 కోట్ల రుణమాఫీ
* గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలోనూ రైతు రుణమాఫీ హామీ
* ఆర్ధిక మాంద్యం అడ్డుపడుతున్నా రైతు శ్రేయస్సే ముఖ్యం
* రూ.25 వేల లోపున్న రైతులు రాష్ట్రంలో 5,83,916 మంది
* నూటికి నూరు శాతం ఒకే దఫాలో రుణ మాఫీ
* ఈ నెలలోనే 25 వేల రూపాయల లోపున్న రుణాలు మాఫీ
* రుణమాఫీని ఎమ్మెల్యేలు రైతులకు వ్యక్తిగతంగా చెక్కుల రూపంలో అందిస్తారు.
* రైతు రుణమాఫీ కోసం ఈ నెలలోనే రూ.1,198 కోట్లు విడుదల 
* రూ. 25 వేల నుంచి లక్ష రూపాయల లోపు ఉన్న రైత రుణాలు రూ.24,738 కోట్లు
* నాలుగు విడతల్లో రైతుల రుణాల మాఫీ
* రైతు రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు

రైతు బీమా:

* రాష్ట్రంలో ఏ రైతు మరణించినా ఆ కుటుంబానికి వెనువెంటనే రూ.5 లక్షలు
* 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వయసున్న ప్రతీ రైతుకు బీమా
* ప్రతి రైతు పేరిట రూ.2,271.50 ప్రీమియం ప్రభుత్వమే ఎల్ఐసీకి చెల్లిస్తోంది
* రైతు మరణించిన పది రోజుల లోపే వారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల బీమా చెల్లింపు
* రైతు బీమా కోసం ఈ బడ్జెట్‌లో రూ. 1,141 కోట్లు

రైతు బంధు:

* రైతు బంధు పథకానికి రూ.12 వేల కోట్లు
* లబ్ధిదారుల సంఖ్య ఈ ఏడాది పెరుగుతుంది
* రూ.25 వేల లోపు రుణాలున్న రైతులందరికీ ఒకే విడతలో రుణ మాఫీ
* రైతులకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పంపిణీ చేస్తారు
* రైతు రుణమాఫీ కోసం రూ. 6,225 కోట్లు
* గోడౌన్ల నిల్వ సామర్ధ్యం పెంచాం
* పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలు
* విజయ డైరీని లాభాల్లోకి తీసుకొచ్చాం

* రైతుబంధు పథకాన్ని దేశంలోని ఎన్నో రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి
* భారత ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
* బడ్జెట్ అంచనా వ్యయం రూ.1,42,152.28 కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ.1,10,824.77 కోట్లు
* మూలధన వ్యయం రూ.13,162.72 కోట్లు
* రెవెన్యూ ఖాతాలో మిగులు రూ. 103.55 కోట్లు

* కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి శీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది
* బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించడం నా అదృష్టం
* రాష్ట్ర వృద్ధిరేటు గతేడాది నుంచి తగ్గుతూ వస్తోంది
* కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గుతున్నాయి
* రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే జీఎస్‌టీ నిధులు సకాలంలో రావట్లేదు
* గతేడాది రెవెన్యూ వృద్ధిరేటు 16 నుంచి 6 శాతానికి తగ్గింది
* ప్రతికూల పరిస్ధితుల్లోనూ సరైన వ్యూహాలు రూపొందిస్తున్నాం
* గతేడాది బడ్జెట్‌లో లక్షా 36 వేల కోట్లు ఖర్చు చేశాం
* ఈ ఏడాది లక్షా 82 వేల 914 కోట్లతో తెలంగాణ బడ్జెట్
* రాష్ట్ర జీఎస్‌డీపీ 12.6 శాతానికి తగ్గింది
* దేశం మొత్తం తీవ్ర మాంద్యం ఉన్నా రెండంకెల వృద్ధిరేటుతో సాగుతున్నాం
* రైతుల కోసం చేపట్టిన పలు పథకాలు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాయి
* రాష్ట్ర తలసరి ఆదాయం దేశం కంటే ఎక్కువ

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభ మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది. 

శాసనసభకు చేరుకున్న మంత్రి హరీశ్ రావు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను స్పీకర్‌, మండలి ఛైర్మన్‌కు మంత్రి హరీశ్ రావు అందజేశారు.

ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఇంటి నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఆర్ అండ్ బీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యంను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. గతంలో లాగే సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios