ఇవ్వాల్టి రోజుల్లో డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం 2019 నుండి ఇప్పటివరకు అత్యధిక కేసులు కర్నాటకలో నమోదయ్యాయి. ఇక్కడ 5500కంటే ఎక్కువ మంది డెంగ్యూ బారిన పడ్డారు. 

కర్నాటకలో డెంగ్యూ నుండి సర్వైవ్ అయిన వారిని సువర్ణ న్యూస్ కలుసుకుంది.  ఈ భయంకర వ్యాధితో తాము ఎలా పోరాటం చేశామో తమ అనుభవాలు పంచుకున్నారు. 

అప్పటివరకు నేను బాగానే ఉన్నాను. హఠాత్తుగా రాత్రికి జ్వరం వచ్చేసింది. రెండు రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు. దీంతోపాటు విపరీతమైన తలనొప్పి. కనీసం సరిగా కూర్చోలేని పరిస్థితి. హాస్పిటల్ కి వెడితే అన్నిరకాల పరీక్షల తరువాత నాకు డెంగ్యూ వచ్చిందని డాక్టర్లు నిర్థారించారు. వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ కమ్మన్నారు. మొదటి రెండు రోజులు జ్వరం చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. నాకసలు ఏమీ గుర్తులేదు. 

మొదటి రెండు రోజులు నా ప్లేట్ లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోతూనే ఉంది ఇది డాక్టర్లకు విషమపరీక్షగా మారింది. ఆ తరువాత ప్లేట్ లెట్ల సంఖ్య క్రమంగా కుదురుకుంది. అది చాలా భయంకరమైన అనుభవం. అందుకే ఇంట్లో, ఇంటి పరిసరాల్లో, చుట్టుపక్కలా దోమలు పెరిగే వాతావరణం లేకుండా చూసుకోమని నేను సలహా ఇస్తున్నాను. 

జ్వరం తగ్గకపోవడానికి కారణం డెంగ్యూ అని మొదట డాక్టర్లు చెప్పగానే నేను చాలా భయపడ్డాను. అయితే అది నా సమస్యలకు ఆరంభం మాత్రమే. ఆ తరువాత నా ప్లేట్ లెట్ల సంక్య తగ్గిపోవడం మొదలయ్యింది. ఎంతవరకు పడిపోయిందంటే రెండు లక్షలకు చేరుకుంది. అంతకంటే ఇంకా పడిపోతే చాలా డేంజర్ అని డాక్టర్లు తేల్చేశారు. చికిత్స మొదలైన తరువాత మొదట ఐదువేలు పెరిగింది. వెంటనే మళ్లీ తగ్గడం ప్రారంభమయ్యింది. మ అమ్మనాన్న బెంగళూరులో ఉండదు. దీంతో నాకు నా స్నేహితులే సాయం చేశారు. ప్లేట్ లెట్లు దానం చేసేవారిని ఏర్పాటు చేయడంలో నా స్నేహితులు చాలా కష్ట పడ్డారు. నాకు సోయి లేదు.. కాసేపు మెలకువగా ఉంటే వెంటనే మళ్లీ అపస్మారకంలోకి వెళ్లి పోతున్నా. దీంతో నా స్నేహితులే అన్నీ మేనేజ్ చేసుకోవాల్పి వచ్చింది. వారు పడుతున్న ఇబ్బందులు చూసి నేను చాలా బాధపడ్డాను. గిల్టీగా ఫీలయ్యాను. నా ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడానికి ఐదు రోజులు పట్టింది. మళ్లీ అవి తగ్గకుండా స్థిరంగా ఉండడానికి మరో మూడు రోజులు. ఆ తరువాత నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. కానీ నేను పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నెల రోజులు పట్టింది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రావద్దని నేను కోరుకుంటున్నాను. ఇలాంటిది జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాల్సి ఉండేదని అనుకుంటాను. 

డెంగ్యూతో పోరాడి బయటపడ్డవాళ్లు ఈ అనుభవాల సారాంశం ఏంటంటే ఒక్క దోమ కూడా ప్రమాదకరమే. అందుకే డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన అన్నిరకాల ముందు జాగ్రత్తలూ తీసుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాల్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.