ఒక వ్యక్తికి డెంగ్యూ వ్యాధి మొదటిసారి రావడం ప్రమాదకరం, కానీ రెండవసారి కూడా వస్తే అది అత్యంత ప్రాణాంతకమని కూడా రుజువయ్యింది. అవును ఇది నిజమే. చికెన్ పాక్స్ లాగే డెంగ్యూ కూడా ఒక్కసారి మాత్రమే వ్యాధి సోకుతుందనే తప్పుడు ఊహలో చాలా మంది ఉన్నారు. డెంగ్యూ అనేది ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఏడెస్ ఈజిప్టి అనే ఆడ దోమ కాటు వల్ల వస్తుంది.

ఈ జాతి దోమలు తక్కువ పరిమాణంలో ఉన్న స్వచ్ఛమైన నీటి ప్రదేశాలలో సంతానోత్పత్తి చేస్తాయి. జబ్బు పడిన వ్యక్తుల నుండి దోమ  ద్వారా డెంగ్యూ వైరస్ సంక్రమణ ఆరోగ్యకరమైన వ్యక్తులకు వ్యాపిస్తుంది. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే డెంగ్యూ వైరస్ ఇతర ఫ్లూ లాంటి వైరస్ లాగా ఒక మనిషి నుండి మరొకరికి వ్యాప్తి చెందదు.

అధిక జ్వరం, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు డెంగ్యూ వచ్చినప్పుడు ప్రజలకు ఉండే కొన్ని లక్షణాలు. ఈ వ్యవధి నుండి కోలుకోవటానికి 2, 3 వారాలు లేదా 4 వారాలు లేదా ఆరు నెలల కూడా పట్టవచ్చూ. మొదటిసారి డెంగ్యూ వస్తే రోగులకు డాక్టర్ సూచించిన సరైన మందులతో ఇంట్లో చికిత్స చేయవచ్చు, కానీ రెండవసారి డెంగ్యూ వస్తే ఆసుపత్రికి వెళ్ళడం తప్పనిసరి.

2004 నుండి 2016 మధ్య సైన్స్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిర్వహించిన ఒక అధ్యయనం వారి పరిశోధనలను వెల్లడించింది, ఏంటంటే రెండవసారి డెంగ్యూ సంక్రమిస్తే మొదటిసారి కంటే మరింత తీవ్రంగా ఉంటుందని, దీని వెనుక గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి 41వేల కన్నా ఎక్కువ మంది రక్త నమూనాలపై పరిశోధనలు జరిపింది. రెండవ సారి డెంగ్యూ సంక్రమిస్తే మరింత తీవ్రంగా ఉంటుందని అధ్యయనంలో కనుగొన్నారు.

భారతదేశంలో డెంగ్యూ సీజనల్ వ్యాధిలా  కాకుండా ఈ వైరస్ వ్యాప్తి ఏడాది పొడవునా ఉంటుంది. జూలై 2020 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 12078 డెంగ్యూ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. ప్రతి సంవత్సరం దేశంలో 1.5 లక్షల డెంగ్యూ కేసులు నమోదవుతునాయి. అలాగే  ప్రజలు రెండవసారి కూడా డెంగ్యూ  వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.

డెంగ్యూ వ్యాధి రాకుండా  మొదటి స్థాయిలోనే  అరికట్టడం చాలా ముఖ్యం, అందుకు దోమలను చంపడం ఒక్కటే మార్గం. ఇంటి లోపల, చుట్టూ ప్రాంగణాన్ని దోమల లేకుండా  గోద్రేజ్ కాలా హిట్ వంటి దోమల స్ప్రేను క్రమం తప్పకుండా ఉపయోగించవచ్చు. ఇంటి బయట, పార్కులు, సాధారణ ప్రాంతాలలో దోమలు లేకుండా ఉండాలంటే దోమల స్ప్రే పిచికారీ చేయలీ.  

ఒక దోమ కూడా చాలా ప్రమాదకరమైనదని మనం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తికి డెంగ్యూ వ్యాధి మొదటిసారి లేదా రెండవ సారి సోకడానికి కేవలం ఒక దోమ కాటు సరిపోతుంది. మీరు ఇంట్లో దోమలను చూస్తే వెంటనే గోద్రేజ్ కాలా హిట్‌తో వాటిని చంపడం డెంగ్యూ నివారణకు ఉత్తమ మార్గం.