భారతదేశంలో 1780ల నుంచి డెంగ్యూ ప్రబలుతోంది. డెంగ్యూ లక్షణాలతో ఓ మొదటి కేసు నమోదైంది. ఆ సమయంలో దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీని తాలుకు విషయాలకు తర్వాతి తరం వారు కథలు కథలుగా చెప్పుకునేవారు.

సాధారణంగా డెంగ్యూ అనేది వెక్టర్ ద్వారా కలిగే వైరల్ ఇన్‌ఫెక్షన్. ఈడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా ఇది వ్యాపిస్తుంది. నిరంతరం అధిక జ్వరం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, చర్మంపై దురద లేదా దద్దుర్లు ఉంటాయి. డెంగ్యూ సోకిన వారిలో కొద్దిశాతం మంది డెంగ్యూ హెమరేజిక్ జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లుగా నిపుణులు గుర్తించారు.

ప్రస్తుతం ఎటు చూసినా కోవిడ్ 19కి సంబంధించిన ఆందోళనకర వాతావరణం వుంది. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకునేలా ప్రజల్లో అవగాహణ ఏర్పడింది. ఇదే సమయంలో జ్వరం వచ్చినంత మాత్రాన తమకు కరోనా సోకలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కరోనా, డెంగ్యూ నిరంతరం అధిక జ్వరాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి జ్వరం తీవ్రత 105 డిగ్రీల వరకు వెళ్లవచ్చు. మీరు లేదా మీ కుటుంబసభ్యుల్లో ఎవరైనా కొన్ని రోజులుగా నిరంతరం అధిక జ్వరంతో బాధపడుతుంటే. మీరు కొన్ని విషయాలను పాటించాలి.

  • శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తూ అది స్థిరంగా ఉందా లేదా పెరుగుతుందా అన్నది చూడాలి. ఇది చికిత్స అందించేందుకు వైద్యుడికి ఎంతగానో తోడ్పడుతుంది.
  • అలాగే రోగికి ఉన్న ఇతర లక్షణాల గురించి కూడా ఒకసారి చెక్ చేయాలి. కరోనా సోకిన వారు రుచి, వాసన శక్తిని కోల్పోతారు. డెంగ్యూ విషయానికి వస్తే కొన్ని రోజుల తర్వాత చర్మంపై దద్దుర్లు, వికారం, వాంతులు అవుతూ ఉంటాయి.
  • వైద్యుడిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ రోగికి సంబంధించిన విషయాలను ఆయనకి తెలియజేయాలి.
  • డెంగ్యూ లేదా ఇతర ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ అవునా.. కాదా అన్నది నిర్థారించుకోవడానికి రక్ష పరీక్ష చేయించాలి.
  • జ్వరం కారణంగా మీ శరీరం డీ హైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.


భయం కారణంగా సాధారణమైన వ్యక్తి గందరగోళానికి గురవుతాడు. అయితే కరోనా ప్రమాదకరమైనదే, కొన్ని సందర్భాల్లో డెంగ్యూ కూడా ప్రమాదకరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. డెంగ్యూ మరణాల రేటు 1 శాతమే అయినప్పటికీ కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. మీ ఇంట్లో ఒకటి లేదా దోమలు కనిపించినట్లయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోండి. డెంగ్యూ నివారణకు ఉత్తమ మార్గం తక్షణమే గోద్రేజ్ కాలా హిట్‌తో దోమలను చంపడమే  .