Asianet News TeluguAsianet News Telugu

టీఆర్పీ బద్ధలవ్వాల్సిందే! ఐపీఎల్ 2023 కామెంటేటర్‌గా నందమూరి బాలకృష్ణ... జియో దెబ్బకు బాలయ్యని దించిన...

ఐపీఎల్ 2023 కామెంటేటర్‌గా మారిన నందమూరి బాలకృష్ణ... ఆరంభ మ్యాచ్‌లకు కామెంటరీ ప్యానెల్‌లో కనిపించి, కామెంటరీ చెప్పబోతున్న బాలయ్య.. 

Nandamuri Balakrishna joins as IPL 2023 Commentator for Star Network cra
Author
First Published Mar 26, 2023, 3:13 PM IST

ఐపీఎల్ 2023 హడావుడి మొదలైపోయింది. ఇప్పటికే జియో, స్టార్ నెట్‌వర్క్‌లు పోటాపోటీగా ఐపీఎల్ కోసం ప్రోమోలు వదులుతున్నాయి. పాత టీవీల దుమ్ము దులపండి అని స్టార్ నెట్‌వర్క్ ప్రోమోలో చూపిస్తే... డబ్బా టీవీలో ఏం చూస్తారు! అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి, మొబైల్‌లో చూడండి అంటూ జియో తెగ ప్రచారం చేస్తోంది...

టెలివిజన్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ స్టార్ నెట్‌వర్క్‌పై జియో దెబ్బ తీవ్రంగా పడింది. ఐపీఎల్ 2023 మొబైల్ ప్రసార హక్కులు కోల్పోవడంతో కొన్ని కోట్ల మంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌ని ఫోన్ల నుంచి డిలీట్ చేసేశారు. సీరియల్స్ కోసం దాన్ని వాడుతున్నవాళ్లు కూడా సబ్‌స్కిప్షన్ రిన్యూవల్ చేసుకోవడం ఆపేశారు...

ఇప్పుడు టీఆర్పీ రేటింగ్‌పైనే ఆధారపడి స్టార్ నెట్‌వర్క్, ఐపీఎల్ 2023 సీజన్ కోసం అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది. మాస్‌లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణని కామెంటేటర్‌గా ఎంచుకుంది. ఆహా యాప్‌లో ‘అన్‌స్టాపబుల్’ ప్రోగ్రామ్‌తో సూపర్ సక్సెస్ సాధించాడు బాలయ్య...

‘అన్‌స్టాపబుల్’ షో కారణంగా నందమూరి బాలకృష్ణపై జనాల్లో ఉన్న అగ్రెసివ్ ముద్ర పూర్తిగా తుడుచుకుపోయింది. బాలయ్యని అభిమానించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడడం బాలయ్య నైజం.. దీంతో టీఆర్పీ పెంచుకునేందుకు బాలయ్యే కరెక్ట్ అని డిసైడ్ అయ్యింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్...

‘చిన్నతనం నుంచి క్రికెట్ అంటే నాకు మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో క్లాస్ రూమ్‌లకు వెళ్లకుండా క్రికెట్ ఆడుతూ కూర్చునేవాడిని. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా క్రికెట్‌కి దగ్గర కావడం చాలా ఆనందంగా ఉంది... ’ అంటూ కామెంట్ చేశాడు నందమూరి బాలకృష్ణ...

ఐపీఎల్ 2023 కామెంటరీ ప్యానెల్‌లో చేరిన నందమూరి బాలకృష్ణ, మొదటి ఒకటి రెండు మ్యాచులకు మాత్రమే కామెంటేటర్‌గా వ్యవహరించబోతున్నాడు. ఆరంభ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వచ్చే బాలయ్యను, ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్‌కి రప్పించాలని ప్రయత్నిస్తోంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్...

ఐపీఎల్ కామెంటేటర్‌గా నందమూరి బాలకృష్ణను రప్పించడం వరకూ బాగానే ఉంది కానీ మనోళ్లు సరిగ్గా ఆడకపోతే ఆయన లైవ్‌లో ఏం మాట్లాడుతారో? ఎలా మాట్లాడుతారోనని సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అయిపోతున్నాయి. బ్యాటర్లు బాగా ఆడకపోతే... బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా ఇప్పటికే మీమ్స్‌ చేసేస్తున్నారు నెటిజన్లు.. 

‘అఖండ’, ‘వీరసింహా రెడ్డి’ సినిమాలతో వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టిన బాలకృష్ణ... ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘అఖండ’ మూవీ సీక్వెల్‌లో మరోసారి బోయపాటి శ్రీనుతో కలిసి నటించబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios