తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,042 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 425 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో 6,111 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ అత్యధికంగా 130 కేసులు నమోదయ్యాయి.