MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • Budget 2025 : కొత్త వ్యవసాయ పథకం , తెలుగు రైతులకు బంపరాఫర్, ఫుల్ డిటైల్స్

Budget 2025 : కొత్త వ్యవసాయ పథకం , తెలుగు రైతులకు బంపరాఫర్, ఫుల్ డిటైల్స్

pm dhan dhanya krishi yojana ; కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మరో పథకాన్ని తీసుకువచ్చింది.  ఈ పథకం ద్వారా తెలుగు రాష్ట్రాల రైతులు కూడా లబ్ది పొందే అవకాశం వుంది. ఇంతకూ ఈ పథకం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 01 2025, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
pm dhan dhanya krishi yojana scheme

pm dhan dhanya krishi yojana scheme

Farmers Welfare Scheme  : నరేంద్ర మోదీ 3.0 సర్కార్ రైతాంగానికి గుడ్ న్యూస్ తెలిపింది. బడ్జెట్ 2025లో రైతులపై వరాలు కురిపించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు కవిత 'దేశమంటే మట్టికాదోయ్-దేశమంటే మనుషులోయ్' తో ప్రారంభమైన నిర్మలమ్మ ప్రసంగం వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వ సాయం ఎలా వుండనుందో చెబుతూ ముందుకు సాగింది. 

దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయాన్ని అభివృద్ది చేసి రైతుల ఆదాయమార్గాలు పెరిగేలా తీసుకున్న నిర్ణయాలను ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందులో ప్రధానమైనది 'ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన'. ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తామని ఆర్థికమంత్రి ధీమా వ్యక్తం చేసారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
pm dhan dhanya krishi yojana scheme

pm dhan dhanya krishi yojana scheme

ఏమిటీ పీఎం ధన్ ధాన్య యోజన :

భారత్ వ్యవసాయ దేశం... కానీ ఆ వ్యవసాయం చేసే రైతులకు ఎప్పుడూ నష్టాలే. ఇలా వ్యవసాయాన్నే నమ్ముకున్న చాలామంది రైతులు ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్నారు. అలాంటి రైతాంగానికి ప్రభుత్వం అండగా వుండేందుకు తీసుకువచ్చిందే ఈ పీఎం ధన్ ధాన్య కృషి యోజన. 

ఈ పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లోని రైతులు లబ్ది పొందనున్నారు. అన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉత్పాదకత,  రైతుల ఆదాయం తక్కువగా వున్న 100 జిల్లాలను ఎంపిక చేయనున్నారు. ఈ జిల్లాల్లో వ్యవసాయ అభివృద్దికి కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది... ఇతర అన్నిరకాలుగా సహాయం చేస్తుంది. తద్వారా పంటల సాగు మెరుగుపడి రైతుల ఆదాయం పెరుగుతుంది. 

ఈ పథకంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చోటు దక్కుతుంది... తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన జిల్లాల అవకాశం దక్కవచ్చు.  ఇలా ఈ పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రైతాంగానికి కూడా లబ్ది చేకూరునుంది. దేశవ్యాప్తంగా మొత్తం 1.7 కోట్లమంది రైతులకు ఈ పీఎం ధన్ ధాన్య కృషి యోజన ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసారు. 
 

33
pm dhan dhanya krishi yojana scheme

pm dhan dhanya krishi yojana scheme

పప్పు ధాన్యాలపై మోదీ సర్కార్ స్పెషల్ ఫోకస్ : 

భారతీయులు ఎక్కువగా పప్పులను ఆహారంగా ఉపయోగిస్తుంటారు... కానీ దేశంలో రోజురోజుకు పప్పుధాన్యాల పంటలు తగ్గిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో పప్పుధాన్యాల కొరత ఏర్పడే అవకాశం వుంది... అంతేకాదు వాటి ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు దూరం కావచ్చు. దీన్ని దృష్టిలో వుంచుకునే పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే పథకానికి శ్రీకారం చుట్టింది. 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో 'మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్' గురించి ప్రస్తావించారు. అంటే రాబోయే ఆరేళ్ళ కాలానికి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోనుంది కేంద్రం. పప్పుధాన్యాలను పండించేలా రైతులను ప్రోత్సహించడం, ఆ పంటలకు మంచి ధర వచ్చేలా చూడటం, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా విత్తనాలను తయారుచేసి అందించడం వంటి చర్యలు  చేపడతారు. 

ఇలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా దేశంలో వీటి కొరతను నివారించవచ్చు... అలాగే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఇలా కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు వంటి ధాన్యాల ఉత్పత్తిని పెంచనున్నారు. 

ఇవి కూడా చదవండి : 

రైతుల అకౌంట్లో డబ్బులే డబ్బులు ... రైతు భరోసాకు ఇంకో రూ.2,000 కలిస్తే పండగేగా...

మీ అకౌంట్లో ఇంకా రైతు భరోసా డబ్బులు పడలేదా? కారణం ఇదేనేమో చెక్ చేసుకోండి?


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నరేంద్ర మోదీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Recommended image2
BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
Recommended image3
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved