తెలంగాణలో కోవిడ్ తగ్గుముఖం.. 2 వేల దిగువకు కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,217 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్‌తో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 26,498 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 383 కేసులు నమోదయ్యాయి.  

1217 new corona cases reported in telangana

తెలంగాణలో కరోనా కేసులు (corona cases in telangana) భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 48,434 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,77,530కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కోవిడ్‌తో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో వైరస్ వల్ల (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,100కి చేరుకుంది. వైరస్ బారి నుంచి నిన్న 3,944 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 26,498 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 383 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 28, భద్రాద్రి కొత్తగూడెం 13, జీహెచ్ఎంసీ 383, జగిత్యాల 18, జనగామ 16, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 3, కామారెడ్డి 5, కరీంనగర్ 36, ఖమ్మం 57, మహబూబ్‌నగర్ 62, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 32, మంచిర్యాల 17, మెదక్ 8, మేడ్చల్ మల్కాజిగిరి 99, ములుగు 2, నాగర్ కర్నూల్ 14, నల్గగొండ 54, నారాయణపేట 7, నిర్మల్ 5, నిజామాబాద్ 24, పెద్దపల్లి 6, సిరిసిల్ల 8, రంగారెడ్డి 103, సిద్దిపేట 45, సంగారెడ్డి 38, సూర్యాపేట 41, వికారాబాద్ 14, వనపర్తి 12, వరంగల్ రూరల్ 7, హనుమకొండ 48, యాదాద్రి భువనగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

కాగా.. మన దేశంలో కొవిషీల్డ్(Covishield), కొవాగ్జిన్‌(Covaxin)లతో పాటు ఆ తర్వాత స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్(Sputnik Light Vaccine) కూడా ఎక్కువ మంది తీసుకున్నారు. రష్యా ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ టీకా ప్రపంచంలోని చాలా దేశాల్లో పంపిణీ చేస్తున్నారు. కాగా, మన దేశంలోనూ కరోనా టీకా రెండు డోసుల పంపిణీ దాదాపు ముగుస్తుండగా.. బూస్టర్ డోసు కూడా పంపిణీ ప్రారంభం అయింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను మూడో డోసుగా పంపిణీ చేస్తున్నారు. కాగా, స్పుత్నిక్ లైట్ టీకానూ బూస్టర్ డోసుగా పంపిణీ చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ (Doctor Reddys Lab) కేంద్రానికి ప్రతిపాదన పెట్టింది. 

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబర్‌లోనే ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఆర్‌డీఐఎఫ్‌కు చెందిన స్పుత్నిక్ లైట్ టీకాను మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ పంపిణీ చేస్తున్నది. భారత్‌లో అత్యవసర సమయంలో పంపిణీ చేసే అనుమతులను భారత రెగ్యులేటరీ సంస్థ డీసీజీఐ రెడ్డీస్ ల్యాబ్‌కు ఇచ్చింది. రష్యా నుంచి ఈ టీకాలను భారత్‌కు అనుమతి చేసుకునే అనుమతులను రెడ్డీస్ ల్యాబ్ పొందిన సంగతి తెలిసిందే. 

బూస్టర్ డోసు విషయమై డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సీఈవో ఎరెజ్ ఇజ్రాయెలీ ఓ ప్రకటన చేశారు. భారత్‌లో తాము స్పుత్నిక్ లైట్ టీకాల నిల్వలతో సంసిద్ధంగా ఉన్నామని వివరించారు. స్పుత్నిక్ లైట్‌ను టీకాగా రిజిస్టర్ చేయడానికి, దాన్ని స్పుత్నిక్ వీ టీకాకు బూస్టర్ డోసుగా వేయడానికి అనుమతులు ఇవ్వాలని రెగ్యులేటరీకి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్పుత్నిక్ టీకా భారత్ సహా ఇతర దేశాలకూ సానుకూలమైన ఒక అవకాశం అని వివరించారు. అయితే, ఇందుకోసం ట్రయల్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉన్నదని పేర్కొన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios