Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పడిపోయిన కరోనా కేసులు.. 24 గంటల్లో 348 మందికి పాజిటివ్

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 348 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా బారి నుంచి నిన్న 429 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 4,396 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

348 new corona cases reported in telangana
Author
hyderabad, First Published Feb 23, 2022, 9:54 PM IST

తెలంగాణలో కరోనా కేసులు (corona cases in telangana) తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 38,580 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 348 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,87,785కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కోవిడ్‌తో (covid deaths in telangana) ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. కరోనా బారి నుంచి నిన్న 429 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 4,396 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 93 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 15, జీహెచ్ఎంసీ 93, జగిత్యాల 8, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 1, కామారెడ్డి 3, కరీంనగర్ 11, ఖమ్మం 16, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 8, మంచిర్యాల 14, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 23, ములుగు 5, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 20, నారాయణపేట 2, నిర్మల్ 6, నిజామాబాద్ 3, పెద్దపల్లి 6, సిరిసిల్ల 8, రంగారెడ్డి 34, సిద్దిపేట 9, సంగారెడ్డి 13, సూర్యాపేట 3, వికారాబాద్ 2, వనపర్తి 6, వరంగల్ రూరల్ 2, హనుమకొండ 11, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

కాగా.. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 5,909,534 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 42.6 కోట్ల మంది దీని బారిన‌ప‌డ్డారు. ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ పంజా విసిరిన దేశాల్లో క‌రోనా కొత్త కేసులు త‌గ్గుముఖం పట్టాయి. అయితే, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు చెందిన స‌బ్ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతున్న‌ద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స‌బ్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతున్న‌ద‌ని చెబుతున్నారు. 

క‌రోనా వైర‌స్ గ‌ణాంకాల‌ను న‌మోదుచేసే వ‌ర‌ల్డో మీట‌ర్ కోవిడ్‌-19 డాష్‌బోర్డు వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 426,470,427 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. కోవిడ్-19తో పోరాడుతూ 5,909,534 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 353,637,928 మంది కోలుకున్నారు. అయితే, కోలుకున్న వారు సైతం మ‌ళ్లీ క‌రోనా బారిన‌ప‌డ‌టం, ప‌లువురిలో కోవిడ్ ల‌క్ష‌ణ‌లు అలాగే కొన‌సాగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన దేశాల జాబితాలో అమెరికా, భార‌త్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్, యూకే, ర‌ష్యా, జ‌ర్మ‌నీ, ట‌ర్కీ, ఇట‌లీ, స్పెయిన్‌, అర్జెంటీనా, ఇరాన్ లు టాప్ లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో దాదాపు స‌గం టాప్‌-5లో ఉన్న దేశాల్లోనే న‌మోద‌య్యాయి. అగ్ర‌రాజ్యం అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,145,282 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. అలాగే, 960,157 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా త‌ర్వాత క‌రోనా వైర‌స్ కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావిత‌మైన రెండో దేశం భార‌త్‌. 

ఇక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,28,51,929 కోవిడ్‌-19 కేసులు, 5,12,344 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ప్ర‌పంచంలో కోవిడ్‌-19 కార‌ణంగా ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మైన మూడో దేశం బ్రెజిల్‌. ఇప్ప‌టికీ అక్క‌డ క‌రోనా ప్ర‌భావం అధికంగానే ఉంది. బ్రెజిల్ ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 28,250,591 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 644,695 మంది చ‌నిపోయారు. ఇక ఫ్రాన్స్ లో 22,304,024 మందికి క‌రోనా సోక‌గా, 132,662 మంది మ‌ర‌ణించారు. బ్రిట‌న్ లోనూ క‌రోనా మ‌ర‌ణాలు అధికంగా సంభ‌వించాయి. బ్రిట‌న్ లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 18,654,572 కేసులు, 160,610 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ర‌ష్యాలోనూ క‌రోనాతో 346,235 మంది చ‌నిపోయారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios