ఆత్మాభిమానం ఎక్కువ, ఆ ఇద్దరిని తొలగించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్

తనకు ఆత్మాభిమానం ఎక్కువని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తనను దూషించిన చెరుకు సుధాకర్, అద్దంకి దయాకర్లను పార్టీ నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Bhuvanagiri MP komatireddy Venkat Reddy Demands To Take Action Against Addanki Dayakar and Cheruku Sudhakar

హైదరాబాద్: చెరుకు సుధాకర్ , అద్దంకి దయాకర్లను పార్టీ నుండి తొలగించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తనను దుర్భాషలాడిని చెరుకు సుదాకర్ ను పార్టీలోకి ఎలా తీసుకొంటారని  ఆయన  ప్రశ్నించారు. తనను బూతులు తట్టిన అద్దంకి దయాకర్ పార్టీలోనే ఇంకా ఉన్నారన్నారు. వీరిద్దరిని పార్టీ నుండి తొలగిస్తే అప్పుడు తాను మాట్లాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.తనను పార్టీ నేతలు ఎవరూ కూడా కలవాల్సిన అవసరం లేదన్నారు.  పార్టీలోనే ఉంటా ఇక్కడే తేల్చుకొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. 

also read:కోమటిరెడ్డితో చర్చించాకే మునుగోడు అభ్యర్ధిని ప్రకటించాలి: కాంగ్రెస్ నేతలకు ప్రియాంక ఆదేశం

సోమవారం నాడు న్యూఢిల్లీలో సోనియాగాంధీ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు. రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నారని ఆయనతో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.ఈ కారణంగానే తాను సమావేశానికి రావడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో ప్రియాంక గాంధీ సోమవారం నాడు చర్చలు జరిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించిన తర్వాతే మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని నిర్ణయించాలని ప్రియాంకగాంధీ సూచించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పార్టీ రాష్ట్ర నేతలు చర్చించాలని కూడా సూచించారు.  ప్రియాంక గాంధీ సూచనలతో త్వరలోనే కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలవనున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 

సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన  పార్టీ సమావేశానికి హాజరు కాకుండా హైద్రాబాద్ కు చేరుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి నుండి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ పదవి నుండి మాణికం ఠాగూర్ ను తప్పించాలని కోరారు. 

తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తనకు తెలియకుండానే చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు చెరుకు సుధాకర్ ప్రయత్నించారని కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి గతంలోనే ఆరోపించారు. మరో వైపు ఈ నెల 5న చండూరులో జరిగిన సభలో తనను అద్దంకి దయాకర్ దూషించడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు కాంగ్రెస్ సీనియర్లు వేదికపై ఉన్న సమయంలోనే అద్దంకి దయాకర్ తనపై వ్యాఖ్యలు చేసినా కూడా పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు. సోనియాకు రాసిన లేఖలో ఈ అంశాలను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి తన అనుచరులతో తనను అవమానిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios