Asianet News TeluguAsianet News Telugu

రాఫెల్ స్కాం: అనిల్ కాదు ముకేశ్‌తోనే చర్చలు.. మున్ముందు ‘టాటా’

న్యూఢిల్లీ: భారత వైమానిక దళ అవసరాల కోసం 2016లో ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ ఆధ్వర్యంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రిలయన్స్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీకి కట్టబెట్టారని ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన పార్టీ పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అనిల్ అన్న ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారన్న సంగతి బయటపడింది. కానీ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగం నుంచి బయటకు రావాలని ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించుకున్నది. 
 

When Mukesh Ambani almost came close to sealing a deal for Rafale
Author
Hyderabad, First Published Sep 13, 2018, 4:23 PM IST

న్యూఢిల్లీ: భారత వైమానిక దళ అవసరాల కోసం 2016లో ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ ఆధ్వర్యంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని రిలయన్స్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీకి కట్టబెట్టారని ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన పార్టీ పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అనిల్ అన్న ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారన్న సంగతి బయటపడింది. కానీ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగం నుంచి బయటకు రావాలని ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించుకున్నది. 

వాస్తవ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేస్తున్న డస్సాల్ట్ ఏవియేషన్ రూ. లక్ష కోట్ల మేరకు పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక రూపొందించింది. కానీ దీనిపై స్పందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, దస్సాల్ట్ నిరాకరించాయి. రాఫెల్ ఒప్పందంలో భాగస్వాములు కావడానికి ఐడియల్ పార్టనర్ కోసం 2007 నుంచి కీలక మధ్యవర్తులు అన్వేషణ సాగించారు. 

ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వద్రాతో సంబంధం కల సంస్థ ఆఫ్ సెట్స్ ఇండియా సొల్యూషన్స్ (ఓఐఎస్) ఈ ఒప్పందంలో అడుగు పెట్టేందుకు గణనీయ స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చింది. ఓఐఎస్ ప్రమోటర్ సంజయ్ భండారీ 2017 ఫిబ్రవరిలో లండన్ నగరానికి పారిపోయిన తర్వాత సదరు సంస్థ మూత పడింది. ఈ ఒప్పందంలో తనకు నచ్చిన ప్రైవేట్ భాగస్వామిని చేర్చుకునేందుకు డస్సౌల్ట్ సంస్థకు స్వేచ్చ ఉంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ప్రధాన ఒప్పందం కుదుర్చుకున్నది. వాస్తవ ఒప్పందం ప్రకారం 126 యుద్ధ విమానాల కోసం రూ.1,07,415 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. 

తొలుత 2007 ఆగస్టు 28న రాఫెల్ యుద్ద విమానాల కోసం భారత్ మీడియం మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒప్పందం కుదిరింది. తొలుత దస్సౌల్ట్ సంస్థతో భాగస్వామ్యం కోసం టాటా సన్స్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్ తదితర సంస్థలు కూడా భారతదేశంలో విమాన తయారీ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందానికి ప్రయత్నించాయి. టాటా సన్స్ సంస్థ అమెరికా భాగస్వామితో మమేకం కావడానికి సిద్దపడటంతో దస్సౌల్ట్ సంస్థ, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో కలిసి ముందుకు సాగాలని అందుకోసం 2008 సెప్టెంబర్ నాలుగో తేదీన రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ సంస్థ (ఆర్ఏటీఎల్) ఏర్పాటు చేశారు. 

2011 మేలో కొన్ని వారాల చర్చల తర్వాత రాఫెల్, యూరో ఫైటర్ యుద్ద విమానాలను షార్ట్ లిస్ట్ చేసిన ఆర్ఏటీఎల్ సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టింది. హెచ్ఏఎల్ పాత్రపై సంప్రదింపులు ప్రారంభించింది. 2012 జనవరిలో తక్కువ బిడ్డర్‌గా దస్సౌల్ట్ నిలిచింది. రక్షణ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు చేపట్టింది. 2014 జూన్ నెలలో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని సంస్థ వెనకడుగు వేసింది. సకాలంలో ఒప్పందం కొనసాగింపునకు చర్యలు తీసుకోకపోవడంతో మురిగిపోయింది. 


ఇలా రిలయన్స్ తో ఒప్పందం మురిగిపోయిన తర్వాత ఓఐఎస్ సంస్థ దస్సౌల్ట్ ఏవియేషన్‌తో చర్చలు జరిపింది. పలుసార్లు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఓఐఎస్ సంస్థ ప్రమోటర్ భండారి కూడా కీలక పాత్ర పోషించారు. కానీ 2016 మే నెలలో న్యూఢిల్లీలోని భండారీ ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. రక్షణ ఒప్పందాలను ప్రభావితం చేశారని అభియోగాలు నమోదు కావడంతో లండన్ కు భండారీ పారిపోయిన తర్వాత ఓఐఎస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక పత్రాలను భండారీ పొందారని ఆరోపణలతో అభియోగాలు నమోదు చేశారు. ఈ విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కూడా చేరింది. 

2015 జూన్ 24వ తేదీన రాఫెల్ ఒప్పందం నుంచి దస్సౌల్ట్ ఏవియేషన్ తప్పుకున్నది. తర్వాత నూతన ఒప్పందం కోసం మోదీ సర్కార్ చర్చలు జరిపింది. అత్యవసర ఒప్పందం కింద 36 రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నది. 2015 మార్చి 28న అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ డిపెన్స్ సంస్థతో దస్సౌల్ట్ ఏవియేషన్‌తో పారిస్‌లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దస్సౌల్ట్ సంస్థ భారతదేశంలోని హెచ్ఏఎల్, లార్సెన్ అండ్ టర్బో, టాటా, బెల్ తదితర 72 భాగస్వామ్య సంస్థలతో ఒప్పందం కోసం  ప్రయత్నిస్తున్నది. ఈ ఒప్పందం వెనుక క్రోనీ క్యాపిటలిజం దాగి ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios