కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఉద్యోగుల తొలగింపు, వేతనాలలో కోత సామాన్యులపై  తీవ్రంగా ప్రభావం చూపుతుంది. లాక్ డౌన్ కారణంగ ఎంతో మంది ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకొంటున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నుంచి బయటపడేందుకు చాలా మంది వారి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటున్నారు.

అయితే పీఎఫ్ విత్‌డ్రాపై ఉద్యోగులకు అనేక సందేహాలు, అపోహలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో కంపెనీలో ఉద్యోగం మానేసినప్పుడు లేదా కంపెనీని శాశ్వతంగా మూసివేసినప్పుడు పీఎఫ్ విత్‌డ్రాలో ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితే మీకు ఎదురైతే పాత కంపెనీలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలో ఈ విధంగా చేయండి.

మీరు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిన సందర్భంలోనే కాక మీ కంపెనీని మూసివేసిన సందర్భంలోనూ మీ పీఎఫ్ ఖాతా 36 నెలల పాటు యాక్టివ్‌లోనే ఉంటుంది. మీరు పనిచేసిన కాలానికి గాను మీ పిఎఫ్‌పై వడ్డీని పొందుతారు. అయితే 36 నెలల గడువు ముగిసిన తరువాత మీ పిఎఫ్ ఖాతా డి-ఆక్టివేట్ అవుతుంది. అయితే అలాంటి సందర్భంలో మీ పిఎఫ్‌ డబ్బును క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం మీ కంపెనీ ధృవీకణ తప్పనిసరి.

also read బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్.. లోన్లపై వడ్డీరేటు మాఫీ.. ...

ఒకవేళ మీ కంపెనీని మూసివేస్తే మీ పీఎఫ్ ధృవీకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి సందర్భంలో మీ బ్యాంక్ కేవైసీ మీ పీఎఫ్‌కు రక్షణగా నిలుస్తుంది. సంస్థను మూసివేస్తే లేదా మీ పీఎఫ్‌ను ధృవీకరించడానికి ఎవరూ లేకపోతే బ్యాంక్ కేవైసీ ద్వారా మీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

దీనికి పాన్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, ఈఎస్ఐ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డు వంటి కేవైసీ పత్రాలను ఉపయోగించుకోవచ్చు. కేవైసీ ద్వారా మీ పీఎఫ్‌ను సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.50 వేలకు మించిన పీఎఫ్ ఫండ్ కోసం అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి.

అయితే రూ.25 వేల లోపు ఫండ్ కోసం మాత్రం డీలింగ్స్ అసిస్టెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో వేతనాలు లేక ఆర్ధిక ఇబ్బందులను తగ్గించుకునేందుకు చాలా మంది ఉద్యోగులు వారి పీఎఫ్‌ డబ్బుబు క్లెయిమ్ చేసుకున్నారు.