ముంబయి: దసరా, దీపావళి పండగ సీజన్‌కు కోసం గృహ రుణాలు, కార్ లోన్ రుణగ్రహీతలకు ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బాబ్) మంగళవారం తెలిపింది.

బరోడా హోమ్ లోన్స్,  బరోడా కార్ లోన్స్ కోసం ప్రస్తుతం వర్తించే వడ్డీరేటుపై 0.25% మాఫీని అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది.

also read బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా వేతనాల పెంపు.. ...

"ఈ పండుగ సీజన్ కోసం ఈ లోన్ ఆఫర్లను ప్రవేశపెట్టడంతో పాటు మేము మా విశ్వసనీయ కస్టమర్లకు దీనిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాము.

బ్యాంకు కస్టమర్లకు కారు లోన్స్ పొందటానికి లేదా తక్కువ వడ్డీరేట్లపై లబ్ది పొందే గృహ రుణాలను ఆకర్షణీయమైన ప్రతిపాదనను కూడా అందిస్తున్నాము. ఈ ఆఫర్‌పై ప్రాసెసింగ్ ఫీజు కూడా మాఫీ "అని జనరల్ మేనేజర్ హెచ్‌టి సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రాసెసింగ్ ఫీజు మాఫీతో కస్టమర్లు తమ ప్రస్తుత గృహ రుణాన్ని బీవోబీ బ్యాంకుకు మార్చుకునే వారికి అదనపు ప్రోత్సాహాన్ని పొందుతారు. కొత్త కార్ కొనుగోలుదారులు చాలా ఆకర్షణీయమైన వడ్డీరేటు పొందవచ్చు.