Asianet News TeluguAsianet News Telugu

ఇంతకంటే ఎక్కువ డబ్బు ఇంట్లో ఉంచితే ఏమవుతుందో తెలుసా...

ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధిత నియమాల్ని తెలుసుకోవడం ముఖ్యం... 

If you keep more than this amount of money at home.. Income tax notice will come.. Do you know how much?-sak
Author
First Published May 2, 2024, 2:53 PM IST

ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్  చేయడానికే ఇష్టపడుతున్నారు. అయితే సాధారణంగా అన్ని రకాల ట్రాన్సక్షన్స్ క్యాష్  రూపంలోనే జరుగుతాయి.  కానీ ఇంటర్నెట్ ఫ్రెండ్లీగా లేని వ్యక్తులు ఆన్‌లైన్ లావాదేవీలకు బదులుగా క్యాష్ ద్వారానే తమ పనులన్నింటినీ పూర్తి చేయడానికి ఇష్టపడతారు.

ఈ కారణంగా ప్రజలు ఇప్పటికీ డబ్బును ఇంట్లో ఉంచుకుంటారు. అయితే పన్ను ఎగవేత, నల్లధనం(black money) వంటి సమస్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం డబ్బుకు సంబంధించి కొన్ని  నిబంధనలు రూపొందించింది. అయితే మనస్సులో తరచుగా ఒక ప్రశ్న తలెత్తుతుంటుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఇంట్లో డబ్బు  ఉంచడానికి ప్రత్యేక నిబంధన లేదా పరిమితి లేదు.

ఆర్థిక స్తోమత ఉంటే ఇంట్లో మీకు కావలసినంత డబ్బు ఉంచుకోవచ్చు. అయితే ఆ మొత్తానికి సంబంధించిన రుజువులు మీ దగ్గర ఉండాలి. ఇన్వెస్టిగేషన్ సంస్థ మిమ్మల్ని ఎప్పుడైనా విచారిస్తే, మీరు రుజువులు చూపవలసి ఉంటుంది. అంతేకాకుండా ఐటీఆర్ డిక్లరేషన్ కూడా చూపించాలి.

అదేంటంటే, మీరు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించకుండా ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు డబ్బు ఎక్కడిదో దర్యాప్తు సంస్థకు చెప్పలేకపోతే, అది మీకు పెద్ద సమస్య అవుతుంది. ఈ విషయం గురించి దర్యాప్తు సంస్థకు సమాచారం అందించబడుతుంది.

అప్పుడు మీరు ఎంత పన్ను చెల్లించారో ఆదాయపు పన్ను శాఖ చెక్ చేస్తుంది. ఇదిలా ఉంటే, లెక్కల్లో వెల్లడించని మొత్తం కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ మీపై చర్య తీసుకోవచ్చు. అటువంటి సందర్భంలో మీరు వెల్లడించని మొత్తంలో 137% వరకు పన్ను విధించబడవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకారం.. బ్యాంకుల్లో ఒకేసారి రూ.50 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం, ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే TDS చెల్లించాలి. అయితే, ఈ నియమం వరుసగా 3 సంవత్సరాలు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయని వారికి మాత్రమే. ఐటీఆర్ ఫైల్ చేసేవారు ఈ విషయంలో కొంత రిలీఫ్  పొందుతారు. అటువంటి వ్యక్తులు TDS చెల్లించకుండానే బ్యాంకు, పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకు అకౌంట్ నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

మీరు ఒక సంవత్సరంలో బ్యాంకు నుండి రూ.1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే, మీరు 2% TDS చెల్లించాలి. మీరు గత మూడేళ్లుగా ఐటీఆర్ ఫైల్ చేయకుంటే రూ. 20 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలపై 2% టీడీఎస్ అండ్  రూ. 1 కోటి కంటే ఎక్కువ లావాదేవీలపై 5% చెల్లించాలి.

క్రెడిట్-డెబిట్ కార్డ్‌ల ద్వారా ఒకేసారి రూ. 1 లక్ష కంటే ఎక్కువ లావాదేవీలు పరిశీలనకు లోబడి ఉండవచ్చు. ఇది కాకుండా, ఏదైనా కోనడానికి మీరు రూ.2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో చెల్లించలేరు. మీరు ఆలా చేయాలనుకుంటే ఇక్కడ పాన్ అండ్  ఆధార్‌ను కూడా చూపించాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios