Asianet News TeluguAsianet News Telugu

జెఫ్ బెజోస్ ఓ కాపీ క్యాట్​: టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ వెటకారం

ప్రపంచంలోనే టాప్​​ యువ పారిశ్రామికవేత్తల మధ్య విభేధాలు​ నడుస్తున్నాయి. ప్రస్తుతం వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వారు గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​ ఒకరు. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ మరొకరు.

Tesla CEO Elon Musk calls Jeff Bezos a copy cat after Amazon acquires self-driving start-up
Author
New Delhi, First Published Jun 28, 2020, 12:37 PM IST

వాషింగ్టన్: ప్రపంచంలోనే టాప్​​ యువ పారిశ్రామికవేత్తల మధ్య విభేధాలు​ నడుస్తున్నాయి. ప్రస్తుతం వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వారు గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​ ఒకరు. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ మరొకరు.

తాజాగా వీరిద్దరి మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​పై ఎలాన్​ మస్క్ ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ స్వీయ నియంత్రణ కార్ల కంపెనీని బెజోస్ కొనుగోలు చేయాలనుకోవడం ఈ వివాదానికి హేతువుగా మారింది. 

టెస్లాలానే జూక్స్​ అనే స్టార్టప్​ కంపెనీ వాహనాల తయారీలో పలు ప్రయోగాలు చేస్తోంది. రోబోలు, పునరుత్పాదక విద్యుత్ సహా పలు టెక్నాలజీల సాయంతో  నూతన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తోందీ సంస్థ. అయితే ఇప్పుడు ఆ స్టార్టప్ సంస్థను ఒక బిలియన్ డాలర్లతో.. జెఫ్ బెజోస్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో బెజోస్​పై ఎలాన్ మస్క్ విమర్శనాత్మక ట్వీట్​ చేశారు. ‘జెఫ్​ బెజోస్​ ఒక కాపీ (క్యాట్)’ అని ట్వీట్ చేశారు. దానికి జూక్స్​ను బెజోస్ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన ఓ కథనాన్ని ట్యాగ్​ చేశారు. అయితే మస్క్ ట్వీట్​పై జెఫ్​బెజోస్​ ఇంకా స్పందించలేదు. 

గతంలో కూడా అమెజాన్ గుత్తాధిపత్యానికి బ్రేకప్ చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ మస్క్ ట్వీట్​ చేయడం చర్చనీయాంశమైంది. టెస్లా, జూక్స్​ మధ్య గతంలో ఓ వివాదం ఉంది. తమ మాజీ ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా లాక్కుందనే ఆరోపణలతో.. టెస్లా జూక్స్​పై దావా వేసింది. ఈ కేసులో జూక్స్ సంస్థ టెస్లాకు పెనాల్టీ కూడా చెల్లించింది.

Follow Us:
Download App:
  • android
  • ios