కాలుష్యాన్ని వెదజల్లే బుల్లి డీజిల్ కార్లకు తెర పడబోతున్నది. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కొన్ని సంస్థలు ఈ ఏడాది డిసెంబర్ నుంచే కాలుష్య కారక.. మరో మాటలో చెప్పాలంటే అధిక ఖర్చుతో కూడిన డీజిల్ ఇంజిన్ కార్లకు తిలోదకాలిస్తున్నాయి. మిగతా సంస్థలు వచ్చే ఏడాది రాం రాం చెప్పాలని, బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
టెక్నాలజీని అంది పుచ్చుకుని ఎప్పటికప్పుడు కొంగ్రొత్త ఫీచర్లతో మంచి మోడల్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.
ప్యాసింజర్ విక్రయ లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేరే అవకాశాలు లేవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తేల్చేసింది. మారుతి, మహీంద్రా సంస్థల్లో స్వల్ప మెరుపులు.. అక్టోబర్ తప్ప గత ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో వాహనాల విక్రయాలు నేలచూపులే చూస్తున్నాయి.
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తాజాగా మార్కెట్లోకి ‘హోండా సివిక్’ అప్ డేట్ కారును విడుదల చేసింది. రూ.17.70 లక్షల ప్రారంభమైన హోండా సివిక్ కారు.. స్కోడా ఓక్టావియా, హ్యుండాయ్ ఎలంట్రా, టయోటా కొరొల్లా అల్టిస్ మోడల్ కార్లకు పోటీగా నిలువనున్నది.
నియంత్రణ సంస్థలను తప్పుదోవ పట్టించినందుకు జర్మనీ ఆటోమేజర్ వోక్స్ వ్యాగన్ సంస్థకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
మార్కెట్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అధునాతన టెక్నాలజీతో వినియోగదారులకు చేరువ కావాలని టాటా మోటార్స్ తలపోస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలకే వాహనాలు సరఫరా చేస్తూ వచ్చిన టాటా మోటార్స్.. ఇక అన్ని వర్గాల కస్టమర్లపై కేంద్రీకరించింది. పర్యావరణ హిత విద్యుత్ కార్ల తయారీపై ద్రుష్టి పెట్టామని టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందుకోసం ‘ఆల్ఫా’ అనే పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశామని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ట్రీటియం సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నది టాటా సన్స్ అనుబంధ టాటా ఆటో కాంప్.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒక్కటైన మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వినియోగదారులకు అవసరమైన విద్యుత్ వాహనాల తయారీలో ముందు నిలిచింది. తాజాగా జెనీవా ఆటో షోలో ఆవిష్కరించిన ‘బటిస్టా’ రెండు సెకన్లలో 62 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. బటిస్టాను తయారు చేసిన ఫినిన్ పారినా సంస్థను 2015లో మహీంద్రా కొనుగోలు చేసింది. బటిస్టా కారు ‘ఫార్ములా వన్’ రేసు కారు కంటే వేగంగా ప్రయాణిస్తుంది
దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో భారత కంపెనీ నాలుగు మోడల్ కార్లు ఆవిష్కరించింది. ఆల్ట్రోజ్ మినహా ఇతర మోడల్ కార్లు ఎప్పుడు విపణిలో అడుగు పెడతాయో బయటపెట్టలేదు. అయితే వినూత్న ఆవిష్కరణల దిశగా టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది.
విద్యుత్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఫేమ్-2’ పథకం అమలు తీరుపై హీరో ఎలక్ట్రిక్ మోటార్స్ ఎండీ నవీన్ ముంజాల్ పెదవి విరిచారు. కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీలు నిర్ణయించడం సరి కాదన్నారు. అలా చేస్తే మోటారు బైక్లు, స్కూటర్లకు ఈ సబ్సిడీ వర్తించదని పేర్కొన్నారు. 70-90 కిమీ వేగంతో సుదూర ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలు ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు.
యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థతో కేటీఎం 250 డ్యూక్ ఏబీఎస్ బైక్ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.1.93 లక్షల నుంచి మొదలవుతుంది.