స్వీడన్ లగ్జరీ ఆటోమొబైల్ దిగ్గజం ‘వోల్వో’ కారు భారతదేశంలో విద్యుత్ ఆధారిత ‘హైబ్రీడ్’కారును ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నది. మేకిన్ ఇండియా నినాదం మేరకు బెంగళూరులోని సంస్థ యూనిట్లో రూపొందించిన ప్లగ్ ఇన్ హైబ్రీడ్, బ్యాటరీతో తయారు చేశామని అన్నారు.
గత నెలలోనూ వాహనాల రిజిస్ట్రేషన్ పడిపోయిందని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) ఆందోళన వ్యక్తం చేసింది. రిటైల్ సేల్స్ 8.25 శాతం పతనమైతే వాణిజ్య వాహనాలు దారుణంగా 7.08 శాతానికి.. ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ 7.9 శాతంగా నమోదైంది. ఇది ప్రతికూల పరిస్థితులకు నిదర్శమని ఫాడా అధ్యక్షుడు ఆశీష్ హర్షరాజ్ పేర్కొన్నారు.
ఇటీవలే జెనీవా ఆటో షోలో బాటిస్టా మోడల్ కారును ప్రదర్శించిన మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ పిన్ఫారినా ఉత్పత్తి చేసిన లగ్జరీ కారు ముంబై రోడ్లపైకి 2021లో దూసుకు రానున్నది. ప్రత్యర్థి సంస్థ లంబోర్ఘినీతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్న పిన్ఫారినా మిలాన్, టురిన్ సమీపాన సొంత ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది.
బ్రిటన్ ఆటోమొబైల్ మేజర్ ట్రయంఫ్.. భారత మార్కెట్లోకి తాజాగా ట్రయంఫ్ టైగర్ 800 ఎక్స్ సీఏ మోడల్ బైక్ ప్రవేశించింది. దీని ధర రూ.15.17 లక్షల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది.
విక్రయాలు పెంచుకోవడంతోపాటు మార్కెట్ విస్తరణ కోసం టాటా హారియర్ రకరకాల ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఆ క్రమంలో ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానున్న క్రికెట్ ‘ఐపీఎల్-’ టోర్నమెంట్లో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది.
కాలుష్యాన్ని వెదజల్లే బుల్లి డీజిల్ కార్లకు తెర పడబోతున్నది. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కొన్ని సంస్థలు ఈ ఏడాది డిసెంబర్ నుంచే కాలుష్య కారక.. మరో మాటలో చెప్పాలంటే అధిక ఖర్చుతో కూడిన డీజిల్ ఇంజిన్ కార్లకు తిలోదకాలిస్తున్నాయి. మిగతా సంస్థలు వచ్చే ఏడాది రాం రాం చెప్పాలని, బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
టెక్నాలజీని అంది పుచ్చుకుని ఎప్పటికప్పుడు కొంగ్రొత్త ఫీచర్లతో మంచి మోడల్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.
ప్యాసింజర్ విక్రయ లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేరే అవకాశాలు లేవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తేల్చేసింది. మారుతి, మహీంద్రా సంస్థల్లో స్వల్ప మెరుపులు.. అక్టోబర్ తప్ప గత ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో వాహనాల విక్రయాలు నేలచూపులే చూస్తున్నాయి.
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ తాజాగా మార్కెట్లోకి ‘హోండా సివిక్’ అప్ డేట్ కారును విడుదల చేసింది. రూ.17.70 లక్షల ప్రారంభమైన హోండా సివిక్ కారు.. స్కోడా ఓక్టావియా, హ్యుండాయ్ ఎలంట్రా, టయోటా కొరొల్లా అల్టిస్ మోడల్ కార్లకు పోటీగా నిలువనున్నది.
నియంత్రణ సంస్థలను తప్పుదోవ పట్టించినందుకు జర్మనీ ఆటోమేజర్ వోక్స్ వ్యాగన్ సంస్థకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది.