నవీన్ ముంజాల్ పెదవిరుపు: బ్యాటరీ బేస్డ్ సబ్సిడీ అంటే బైక్‌లు యమ కాస్ట్‌లీ

విద్యుత్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఫేమ్-2’ పథకం అమలు తీరుపై హీరో ఎలక్ట్రిక్ మోటార్స్ ఎండీ నవీన్ ముంజాల్ పెదవి విరిచారు. కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీలు నిర్ణయించడం సరి కాదన్నారు. అలా చేస్తే మోటారు బైక్‌లు, స్కూటర్లకు ఈ సబ్సిడీ వర్తించదని పేర్కొన్నారు. 70-90 కిమీ వేగంతో సుదూర ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలు ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు.
 

Not just battery power, consider performance and range for FAME II subsidy: Hero Electric

కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగానే విద్యుత్ వాహనాలకు రాయితీ ఇస్తామంటే సరిపోదని హీరో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ అన్నారు. ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్‌ఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్ (ఫేమ్‌-2‌) పథకం ద్వారా భారత దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదని అన్నారు. 

కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగానే విద్యుత్ వాహనాలపై సబ్సిడీలను కేటాయించడం వల్ల ద్విచక్ర వాహనాల రేట్లు పెరుగుతాయని  హీరో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ అన్నారు. ఫేమ్‌-2 పథకం కింద రూ.10వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం సంగతి తెలిసిందే.

‘ఈ పథకం కింద వాహనాలకు రాయితీ పూర్తిగా బ్యాటరీ సామర్థ్యం ఆధారంగానే ఇస్తున్నారు. బ్యాటరీ తయారీకి అయ్యే ఖర్చును లెక్కించడం ద్వారా ఆ మొత్తాన్ని వినియోగదారుడికి అందిస్తారు. అది సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం’ అని   హీరో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ అన్నారు.

‘నగరాల్లో వాహనాల గరిష్ఠ వేగం సగటున గంటకు 30-35 కి.మీ మించదు. రోజు మొత్తం మీద 30-40కి.మీలకు మించి కూడా ఎవరూ ప్రయాణించరు. అలాంటప్పుడు అతి పెద్ద బ్యాటరీల అవసరం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి రాయితీ వల్ల వచ్చే ప్రయోజనం చాలా తక్కువ. ప్రస్తుతం వస్తున్న రాయితీలో సగానికి సగం తగ్గిపోతుంది’ అని  హీరో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ అన్నారు. 

ఫేమ్‌-2 పథకాన్ని వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మూడేళ్ల పాటు అమలు చేయనున్నారు. ఈ పథకం కింద 10లక్షల ద్విచక్రవాహనాలు, ఐదు లక్షల మూడు చక్రాల వాహనాలు, 55వేల నాలుగు చక్రాల వాహనాలతో పాటు, 7వేల బస్సులకు రాయితీ ఇవ్వాలని భావిస్తోంది.

ప్రజా రవాణాకు ఉపయోగించే త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలపై సబ్సిడీలు ఇవ్వడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తోంది. ద్విచక్ర వాహనాల సెగ్మెంట్‌కు వచ్చే సరికి ప్రైవేట్ (వ్యక్తిగత) వాహనాలపై ఫోకస్ చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతించిన నవీన్ ముంజాల్.. దీర్ఘ కాలం కొనసాగించాలని కోరారు. కేవలం మ్యాట్రిక్స్ ఆధారంగా నిర్ణయించడం సరి కాదని చెప్పారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో 70-90 కిలోమీటర్ల వేగంతో సుదూర ప్రయాణం చేసే వాహనాలు అత్యంత వ్యయ భరితం అని  హీరో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెగ్మెంట్‌లో విద్యుత్ ఆధారిత టూ వీలర్స్ ధరలు రూ.లక్షకు పైనే ఉంటాయిన, ఇందులో సగం ధర సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. మార్కెట్లో పరిస్థితులను అలవర్చుకునే స్థాయికి వినియోగదారులు ఇంకా చేరలేదని, ద్విచక్ర వాహనాల ధరవరలపై సంప్రదింపులు జరుపాల్సి వస్తుందన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios