Asianet News TeluguAsianet News Telugu

డీజిల్ కార్లు వద్దే వద్దు.. పెట్రోల్ వేరియంట్లు ముద్దు

కాలుష్యాన్ని వెదజల్లే బుల్లి డీజిల్ కార్లకు తెర పడబోతున్నది. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కొన్ని సంస్థలు ఈ ఏడాది డిసెంబర్ నుంచే కాలుష్య కారక.. మరో మాటలో చెప్పాలంటే అధిక ఖర్చుతో కూడిన డీజిల్ ఇంజిన్ కార్లకు తిలోదకాలిస్తున్నాయి. మిగతా సంస్థలు వచ్చే ఏడాది రాం రాం చెప్పాలని, బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 

Indian market will soon bid adieu to a dozen small diesel cars
Author
Hyderabad, First Published Mar 10, 2019, 3:19 PM IST

సరిగ్గా మరో ఏడాది కల్లా.. అంటే 2020 ఏప్రిల్ నాటికి భారత ఆటోమొబైల్ పరిశ్రమ డీజిల్‌తో నడిచే డజన్ కంపాక్ట్, ఎస్‌యూవీ, సెడాన్ కార్లకు వీడ్కోలు పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డీజిల్ వేరియంట్ కార్లతో పోలిస్తే స్వల్ప ధరల తేడాతో డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గిపోయింది. కాలుష్యం వెలువరిస్తున్న డీజిల్ కార్లు నియంత్రణ సంస్థలు, న్యాయస్థానాల్లో వాటిపై ఆంక్షలు విధిస్తున్నాయి. 

ఆటోమొబైల్ పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు పేర్కొన్న వివరాల మేరకు ఫియట్ 1.3 లీటర్ల డీజిల్ వేరియంట్ సామర్థ్యం గల మల్టీ జెట్.. ప్రస్తుతం బారీగా అమ్ముడు పోతున్న మారుతి సుజుకి మోడల్ కార్లు స్విఫ్ట్, డిజైర్, బాలెనో, విటారా బ్రెజ్జా మోడల్ కార్ల ఉత్పత్తి ఈ ఏడాది చివరికల్లా నిలిచిపోనున్నాయి. 

ఇదే ఇంజిన్ సామర్థ్యం గల డీజిల్ వేరియంట్ టాటా మోటార్స్ కార్లు బోల్ట్, జెస్ట్‌తోపాటు 1.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ సామర్థ్యం గల మహీంద్రా అండ్ మహీంద్రా ‘కేయూవీ’ మోడల్, వోక్స్ వ్యాగన్ 1.5 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్‌తో కూడిన పోలో, వెంటో, టాయోటా రాపిడ్ మోడల్ కార్ల జీవితం 2020 ఏప్రిల్ నెలతో ముగిసిపోనున్నది. 

మరోవైపు వచ్చే ఏడాది ఒకటో తేదీ నుంచి భారత్ స్టేజ్ -4 ప్రమాణాలతో కూడిన కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలులోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్ నాటికి తొమ్మిది నెలలుగా 20 శాతం డీజిల్ వాహనాల విక్రయాలు తగ్గిపోగాయి. ఇది దశాబ్ద కాలం క్రితం రికార్డుతో సమానం. 

చిన్న డీజిల్ ఇంజిన్ కార్లలో ఇంజిన్లను బీఎస్ - ప్రమాణాలకు అనుగుణంగా అభివ్రుద్ధి చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహరం అని కార్ల తయారీ సంస్థల యాజమాన్యాలు తేల్చేశాయి. బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్య రహిత ప్రమాణాలకు అనుగుణంగా బుల్లి డీజిల్ కార్ల ఇంజిన్లను అప్ గ్రేడ్ చేయాలంటే రూ.1.3 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతుందని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. 

అదే పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ల అప్ గ్రెడేషన్ కోసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తే సరిపోతుందని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. ఇప్పటికే డీజిల్ ఇంజిన్ తయారు చేయడానికి వ్యయం రూ.1-1.2 లక్షలు ఖర్చవుతోంది. బీఎస్- 6 ప్రమాణాలతో మార్పులు చేయాలంటే ప్రెటోల్ వేరియంట్ కారు కంటే రూ.2-2.5 లక్షలు అదనపు ఖర్చు వస్తుంది. 

అదనపు ధరలకు డీజిల్ వేరియంట్ కార్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు అనుమతించబోరని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు క్రమంగా డీజిల్ వినియోగంతో నడిచే యుటిలిటీ వెహికల్స్ ను పెట్రోల్ వైపు మళ్లిస్తున్నాయి. 

2012 నాటికి 98 శాతం యుటిలిటీ వాహనాలు డీజిల్ తోనే నడిచేవే. కానీ 2019 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే అది 83.5 శాతానికి పడిపోయింది. బుల్లి డీజిల్ కార్లకు గ్రహణం పట్టిందని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేయాలంటే రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతోందని అంచనా. 

మరోవైపు సియాజ్, ఎర్టిగా, ఎస్ క్రాస్ మోడల్ కార్లలోని 1.5 లీటర్ల సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్‌ను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు మారుతి సుజుకి ఓవర్ టైం పని చేస్తోంది. ఇందుకు ఖర్చు 17 నుంచి 20 శాతం వరకు ఖర్చవుతుందని మారుతి సుజుకి అంచనా వేస్తోంది. 


టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల డివిజన్ విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ మాట్లాడుతూ బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా రూ.10 లక్షల్లోపు డీజిల్ వేరియంట్ మోడల్ కార్లు విక్రయించగలమని ఊహించడం కష్ట సాధ్యమేనని పేర్కొన్నారు.

బుల్లి డీజిల్ కారుపై రూ.1-1.5 లక్షల నుంచి మిగతా అన్ని కార్లపై సగటున రూ.5 లక్షల వరకు ధర పెరిగే అవకాశం ఉన్నదని, అదే జరిగితే కారు ధర రూ.20 లక్షలు పలుకుతుందని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల డివిజన్ విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios