విపణిలోకి ‘కేటీఎం 250 డ్యూక్ ఏబీఎస్’
యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థతో కేటీఎం 250 డ్యూక్ ఏబీఎస్ బైక్‌ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.1.93 లక్షల నుంచి మొదలవుతుంది.
సరికొత్త యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ కేటీఎం 250 డ్యూక్ ఏబీఎస్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇప్పటికే కేఈటీఎం పలు మోడల్స్‌లో దీన్ని ఏర్పాటుచేసింది. ఇప్పుడు 250 మోడల్‌లోనూ అందుబాటులోకి తేవడంతో మొత్తం కేటీఎం బైకుల మోడళ్లలో ఈ వ్యవస్థ వచ్చినట్లైంది.
సరికొత్త కేటీఎం 250 డ్యూక్ ధరను రూ.1.94లక్షలుగా నిర్ణయించారు. మార్చి 31లోపు 125సీసీ దాటి ఉంటే మోటార్ సైకిళ్లలో ఈ ఫీచర్ తప్పనిసరి. సరికొత్త కేటీఎం 250 డ్యూక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ను అమర్చారు.
గతంలో ‘ది 390 డ్యూక్’లో ఈ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్ వల్ల వెనుక చక్రానికి ఏబీఎస్‌ను కొద్దిసేపు నిలిపివేసే అవకాశం లభిస్తుంది. మిగిలిన ఫీచర్లు మొత్తం 2017 కేటీఎం 250 డ్యూక్‌లో ఉన్నవే కొనసాగిస్తున్నారు.
వాహన ఎల్‌పీజీ కిట్‌లపై జీఎస్‌టీ తగ్గించండి
పర్యావరణ హిత వాహనాలకు ఊతమిచ్చేందుకు ఎల్పీజీ కన్వర్షన్ కిట్‌లపై విధిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని వాహన ఎల్‌పీజీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. అధిక జీఎస్‌టీ రేట్లు, ఎల్‌పీజీకి మారాలనుకునేవారికి అడ్డంకిగా మారిందని వాహన అత్యున్నత సంఘం ఇండియన్ ఆటో ఎల్‌పీజీ పేర్కొంది.
ఇప్పటికే క్రూడాయిల్‌పై అధిక జీఎస్‌టీ శ్లాబ్‌లో ఉందని, ప్రభుత్వం పట్టణ వాహన నాణ్యత పెంచడంపై దృష్టి పెట్టాలని వాహన అత్యున్నత సంఘం ఇండియన్ ఆటో ఎల్‌పీజీ కోరింది. ఎల్‌పీజీ కన్వర్షన్ కిట్ విలాస వస్తువు కాదని ఇండియన్ ఆటో ఎల్‌పీజీ డైరెక్టర్ జనరల్ సుయాశ్ గుప్తా పేర్కొన్నారు. ఎల్‌పీజీ వాహనాల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.