చీట్ డివైజ్ వాడినందుకు... వోక్స్‌వ్యాగన్‌కు రూ.500 కోట్లు జరిమానా

నియంత్రణ సంస్థలను తప్పుదోవ పట్టించినందుకు జర్మనీ ఆటోమేజర్ వోక్స్ వ్యాగన్ సంస్థకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

NGT Slaps Rs 500 Crore Penalty on Volkswagen for Cheating Emission Tests

జర్మనీ ఆటోమొబైల్ మేజర్ వోక్స్ వ్యాగన్ (వీడబ్ల్యూ) సంస్థకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో గట్టి ఎదురు దెబ్బ తగలిగింది. భారత్‌లో విడుదల చేసిన డీజిల్‌ కార్లలో ‘చీట్‌ డివైజ్‌’ ఉపయోగించిందని, దీని వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిందని ఎన్జీటీకి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. 

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఉద్గారాలు వెలువరుస్తూ పర్యావరణానికి హానీ కలిగించినందుకు వోక్స్‌వ్యాగన్‌కు ఎన్జీటీ రూ. 500కోట్ల జరిమానా విధించింది. రెండు నెలల్లోగా ఈ మొత్తాన్ని జమచేయాలని ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ ఆదేశాలు జారీ చేశారు.

వోక్స్‌వ్యాగన్‌ డీజిల్‌ కార్లలో ఉపయోగించే ఓ పరికరం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని సంస్థపై ఉద్గారాల కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి రూ.100కోట్లు జమ చేయాలని ఆదేశించింది.

కేసు దర్యాప్తు నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి, భారీ పరిశ్రమల శాఖ, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఆటోమేటివ్‌ రీసర్చ్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

వీరి నుంచి సిఫార్సులు తీసుకున్న అనంతరం.. పర్యావరణాన్ని కలుషితం చేసినందుకు  వోక్స్‌వ్యాగన్‌కు రూ. 500కోట్ల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. 

ఈ నగదుతో ఢిల్లీలోని నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)తో పాటు అత్యధిక కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా ఎన్‌జీటీ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేయ నున్నట్టు ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా తెలిపింది.

అందరి ద్రుష్టిని ఆకర్షించిన హ్యుండాయ్ సాంత్రో
సరికొత్త హ్యుండాయ్‌ సాంత్రో సత్తా చాటుకుంటోంది. జెనీవా మోటార్‌ షోలో ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. వరల్డ్‌ కారు అవార్డ్స్‌-2019లో భాగంగా ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ అర్బన్‌ కారు కేటగిరీలోని టాప్‌-3 కార్లలో సాంత్రో కూడా ఒకటిగా షార్ట్‌లిస్ట్‌ అయింది.

భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి కారు సాంత్రో ఒక్కటేనని హ్యుండాయ్‌ తెలిపింది. భారత్‌లో తయారైన ఈ కారు ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. వచ్చే ఏప్రిల్‌ 17న న్యూయార్క్‌ ఇంటర్నేషనల్‌ ఆటో షోలో విన్నర్లను ప్రకటించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios